Laughing Snake: నవ్వుతున్న పాము ఫొటో చూసి షాకవుతున్న జనాలు..! నెట్టింట్లో వైరల్ అవుతున్న ఇమేజ్..
Laughing Snake: ప్రపంచంలోని ప్రతి మనిషికి సొంత అభిరుచి ఉంటుంది. అందులో కొంతమంది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడుతారు. అడవిలోని ప్రతి
Laughing Snake: ప్రపంచంలోని ప్రతి మనిషికి సొంత అభిరుచి ఉంటుంది. అందులో కొంతమంది వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడుతారు. అడవిలోని ప్రతి అందమైన క్షణాన్ని కెమెరాలో బంధించడాన్ని వీళ్లు ఆస్వాదిస్తారు. అయితే వన్యప్రాణి ఫోటోగ్రఫీ చాలా కష్టమైన, ప్రమాదంతో కూడుకున్న పని. అయినప్పటికీ కొంతమంది అరుదైన చిత్రాలు తీయడానికి రిస్క్ తీసుకుంటారు. వారు తీసిన ఉత్తమ వన్యప్రాణి ఫొటోలను జనాలు ఆదరించడమే కాకుండా తెగ లైక్ చేస్తారు.
ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల వెబ్‌సైట్.. కామెడీ వైల్డ్‌లైఫ్ ఫోటో అవార్డుల కోసం 42 ఫోటోల జాబితాను విడుదల చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒకటి నవ్వుతున్న పాము ఫోటో. ఈ ఫొటోను ఇండియన్స్ తెగ లైక్ చేస్తున్నారు. 7,000 ఫోటోగ్రాఫ్‌లలో 42 ఫొటోలు మాత్రమే కామెడీ వైల్డ్‌లైఫ్ అవార్డులకు ఎంపికయ్యాయి.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఆదిత్య క్షీరసాగర్ క్లిక్ చేసిన ఈ చిత్రం అందరికి నచ్చింది. లాఫింగ్ స్నేక్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఫోటోను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఈ పామును అందంగా వర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య క్షీరసాగర్ మాట్లాడుతూ.. భారతదేశంలోని పశ్చిమ కనుమలలో బెల్ పాములు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఎవరైనా వాటితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తే అవి నోరు తెరిచి నవ్వుతూ తన దూకుడును ప్రదర్శంచడానికి సిద్ధంగా ఉంటాయి.
లాఫింగ్ స్నేక్ పేరుతో వైరల్ అయిన ఈ ఫోటోను చూస్తే ఎవరైనా నవ్వుతారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే చాలా చర్చనీయాంశమైంది. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఒక వినియోగదారుడు ఇది నిజంగా చాలా అరుదైన దృశ్యం అన్నాడు. ఖచ్చితంగా ఈ ఫొటోను తీయడానికి ఫొటోగ్రాఫర్ చాలా కష్టపడి ఉంటాడని చెప్పాడు. అదే సమయంలో కొంతమంది ఇది నిజంగా అద్భుతమైన చిత్రం అని కొనియాడారు.