AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Food Viral Video: లడ్డూ ప్రియులకు తియ్యటి శుభవార్త..! ఈ వీడియో చూస్తే టెన్షన్‌ లేకుండా తింటారు..లక్షల మంది లైక్‌ చేశారు..

ఇప్పుడు లడ్డూల తయారీకి మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మోతీచూర్ లడ్డూలను తయారు చేయడానికి మీకు చక్కటి మార్గం ఒకటి దొరికింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. లడ్డూలను చేతితో తయారు చేయాల్సిన అవసరం లేదు. అవును, మీరు సరిగ్గానే చదివారు. అమృత్‌సర్‌లోని ఒక దుకాణం నుండి వచ్చిన ఈ వీడియో వారు పిండిలో చేతులు పెట్టకుండా లడ్డూలను ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తుంది. బూందీ తయారు

Food Viral Video: లడ్డూ ప్రియులకు తియ్యటి శుభవార్త..! ఈ వీడియో చూస్తే టెన్షన్‌ లేకుండా తింటారు..లక్షల మంది లైక్‌ చేశారు..
Laddu Machine
Jyothi Gadda
|

Updated on: Mar 20, 2024 | 7:40 PM

Share

సంతోషకరమైన సందర్భం ఏదైనా సరే..ముందుగా అందరికీ గుర్తుకువచ్చేది లడ్డూలు.. పండుగ అయినా, పూజ అయినా, పెళ్లి, పేరంటం ఏదైనా సరే..శుభకార్యంలో ఉండే స్వీట్లలో లడ్డూలే రారాజు. కానీ కొన్నిసార్లు లడ్డూలను తయారు చేయడానికి పడే శ్రమ ఆ సరదా సంతోషాన్ని నీరుగార్చేలా చేస్తుంది. మీరు కూడా ఇలాగే ఫీలవుతున్నట్టయితే..ఇకపై చింతించాల్సిన పనిలేదు..ఎందుకంటే.. ఇప్పుడు లడ్డూల తయారీకి మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మోతీచూర్ లడ్డూలను తయారు చేయడానికి మీకు చక్కటి మార్గం ఒకటి దొరికింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. లడ్డూలను చేతితో తయారు చేయాల్సిన అవసరం లేదు. అవును, మీరు సరిగ్గానే చదివారు. అమృత్‌సర్‌లోని ఒక దుకాణం నుండి వచ్చిన ఈ వీడియో వారు పిండిలో చేతులు పెట్టకుండా లడ్డూలను ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తుంది. బూందీ తయారు చేసిన తర్వాత, ఒక వ్యక్తి యంత్రంలో పదార్థాలను వేయటం కనిపిస్తుంది.

దుకాణదారుడు గుండ్రటి లడ్డూలు తయారు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశాడు.. దాంతో ఈజీగా ఎంతో టేస్టీ టెస్టీ గుండ్రని లడ్డూలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, ఫుడ్ పేజీలో “భారతదేశంలో అత్యంత శుభ్రమైన స్వీట్ షాప్” అని రాశారు. ప్రజలు ఈ వీడియోను చూసిన వెంటనే, వారు దీన్ని చాలా ఇష్టపడ్డారు. వీడియోపై చాలా కామెంట్లు కూడా వచ్చాయి. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోతో పాటుగా ఉన్న క్యాప్షన్, “ఆటోమేటిక్ లడ్డూ!” పరిశుభ్రతను చూసి, ఒక వినియోగదారు, “వావ్! వారు చేతికి కవర్‌ గ్లౌజులు కూడా ధరించి ఉన్నారు. మరొకరు “వావ్. నాకు ఇష్టమైన స్వీట్లలో ఒకటి లడ్డూ!” అంటూ హార్ట్ ఎమోజీలను కూడా పెట్టారు. మొదటి సారిగా లడ్డూలను హైటెక్ పద్ధతిలో తయారు చేయడం చూశాను.. అవి కూడా గుండ్రంగా ఉన్నాయని మరొకరు రాశారు.

ఆ వీడియోపై జనాలు విపరీతమైన రియాక్షన్స్ ఇచ్చారు. ప్రజలు వీడియోను చూసిన వెంటనే చాలా మంది ఇది అద్భుతంగా ఉందంటూ కామెంట్‌లలో రాశారు. కొందరు ఛోటా భీమ్‌ని కూడా గుర్తు చేసుకున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “ఛోటా భీమ్: మహారాజ్ ఈ యంత్రాన్ని ధోలాపూర్‌లో అమర్చాలి అంటూ మరికొందరు ఫన్నీగా రాశారు. ఇలా చాలా మంది వినియోగదారులు వీడియోపై తమదైన శైలిలో అభిప్రాయాలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..