Watch Video: రాజధాని వీధుల్లో పోకిరీల హల్ చల్..! హోలీ పేరుతో రెచ్చిపోయి రోడ్లమీదే ఇలా.. నెటిజన్ల ఫైర్..
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ వీడియో ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ వైరల్ క్లిప్‌లో ఇద్దరు యువకులు కదులుతున్న వాహనం సన్‌రూఫ్ నుండి రోడ్డు మీద వెళ్తు్న వ్యక్తులపై వాటర్ బెలూన్లు విసురుతున్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు వారితో లాఠీలతో హోలీ ఆడాల్సిన సమయం ఆసన్నమైందంటూ నెటిజన్లు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. వైరల్ వీడియో చూస్తే మీరు కూడా ఆగ్రహంతో ఊగిపోతారు..
హోలీకి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మథుర-బృందావన్‌లో మార్కెట్‌లు అందమైన రంగులతో ముస్తాభయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్పుడే రంగులతో ఆడుకోవడం ప్రారంభించారు. అయితే ఢిల్లీ నుంచి అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులకు కోపం తెప్పించింది. వాస్తవానికి, వసంత్ కుంజ్ ప్రాంతంలో ఇద్దరు యువకులు చేసిన హంగామా అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. వారు కదులుతున్న వాహనం సన్‌రూఫ్ నుండి వాటర్ బెలూన్‌లను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు, మహిళలపై విసురుతూ కనిపించారు. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఇదంతా వీడియో తీసి ఎక్స్‌లో పోస్ట్ చేసింది. వారిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేసింది. పోలీసులు ఆ పోకిరీలను పట్టుకుని లాఠీలతో హోలీ ఆడాలంటున్నారు నెటిజన్లు.
వీడియో మార్చి 17న @snehasi78473513 హ్యాండిల్‌తో మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో పోస్ట్ చేయబడింది. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, ఢిల్లీ పోలీస్, ఢిల్లీ పోలీస్ కమీషనర్‌లను ట్యాగ్ చేస్తూ ఇలా రాశారు. మార్చి 16 మధ్యాహ్నం వసంత్ కుంజ్‌లో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు, మహిళలపై ఇద్దరు యువకులు వాటర్ బెలూన్లు విసురుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి పనుల కారణంగా ప్రజలు గాయపడే ప్రమాదం ఉందన్నారు.
Yesterday afternoon 16.03.24 in vasant kunj New Delhi, these two boys throwing random water balloons on people and ladies too in the street. This is extremely dangerous and could have injured someone badly. @DelhiPolice @dtptraffic @ndtv @ZeeNews @aajtak @DelhiPoliceCom1 pic.twitter.com/GnMEhjV9Zw
— sneha singh (@snehasi78473513) March 17, 2024
ఈ విషయం వైరల్ అయినప్పుడు, ఈ క్లిప్ కూడా @gharkekalesh హ్యాండిల్‌తో పోస్ట్ చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోను 8 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారు. ఐదు వేలకు పైగా లైక్‌లను పొందింది. అలాగే, వందలాది మంది వినియోగదారులు కూడా ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..