AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. పోలీసుపైకి దూసుకొచ్చిన చిరుత.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్

కొల్హాపూర్‌లో చిరుతపులి సృష్టించిన బీభత్సం నగరవాసులను భయభ్రాంతులకు గురిచేసింది. చిరుతను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేయగా, ఓ అధికారి తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మహావితరణ్ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ దాడితో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది.

Viral Video: వామ్మో.. పోలీసుపైకి దూసుకొచ్చిన చిరుత.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్
Kolhapur Leopard Attack
Krishna S
|

Updated on: Nov 12, 2025 | 2:23 PM

Share

మహారాష్ట్రలోని కొల్హాపూర్ నగరంలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలో భాగంగా చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల బృందంపై ఆ చిరుత దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి తృటిలో తప్పించుకోవడం గమనార్హం. మహావితరణ్ MSEB ప్రధాన కార్యాలయం సమీపంలో ఈ సంఘటన జరిగింది.

చిరుతపులి తమను వెంబడించడంతో పోలీసు అధికారులు ఇరుకైన సందుల్లో పారిపోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి నేలపై పడిపోయారు. వెంటనే, చిరుతపులి అతనిపైకి దూకి దాడికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ, ఆ అధికారి అప్రమత్తంగా ఉండగా.. మిగిలిన బృందం కేకలు వేస్తూ, వస్తువులు విసరడం వల్ల చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. దీంతో ఆ పోలీసు అధికారి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

దాడులు, గాయాలు..

వుడ్‌ల్యాండ్ హోటల్, బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, మహావితరణ్ కార్యాలయం వంటి ప్రముఖ ప్రాంతాలలో చిరుతపులి సంచరించినట్లు నివేదికలు రావడంతో నగరవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసు అధికారులు కర్రలు, రాడ్లను ఉపయోగించడం వలన చిరుత మరింత దూకుడుగా మారి, దాడికి తెగబడింది. ఈ ఆపరేషన్ సమయంలో ఒక పోలీసు అధికారితో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అటవీ అధికారులు తెలిపారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తమిళనాడులో  పాము..

మరో భయానక సంఘటనలో.. తమిళనాడులోని నామక్కల్-సేలం రోడ్డుపై కారు సైడ్ మిర్రర్‌లో పాము కన్పించడంతో డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చలి, వర్షాకాలంలో వాహనాలను క్షున్నంగా తనిఖీ చేయాలని ఈ సంఘటన గుర్తు చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..