AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు

అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 3:24 PM

Share

ధర్మవరం పట్టణంలో నిత్యం తాగొచ్చి భార్య రాధను వేధిస్తున్న మాలిన్ భాషాను బావమరుదులు హత్య చేశారు. కులాంతర వివాహం చేసుకున్న ఈ దంపతులకు నలుగురు పిల్లలున్నారు. భార్యపై అనుమానంతో వేధింపులు ఎక్కువవడంతో, సహనం కోల్పోయిన బావమరుదులు పూలకుండీతో కొట్టి బావను కడతేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అక్కను వేధిస్తున్నాడని.. నిత్యం తాగొచ్చి గొడవ పడుతున్నాడని.. ఇది చూసి తట్టుకోలేక ఏకంగా బావనే లేపేశారు ఆ బావమరుదులు. ధర్మవరం పట్టణానికి చెందిన మాలిన్ భాషా 14 ఏళ్ల క్రితం రాధ అనే మహిళ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. మాలిన్ భాషా, రాధా దంపతులకు నలుగురు పిల్లలు. కులాంతర వివాహం చేసుకుందని రాధా కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మాలిన్ భాష మద్యానికి బానిస అయ్యాడు. రోజు మద్యం తాగి భార్య రాధాపై అనుమానంతో వేధింపులకు గురి చేస్తున్నాడు. నిత్యం తాగొచ్చి భార్య రాధాతో మాలిన్ భాషా గొడవ పడుతుండేవాడు. ప్రతీ రోజూ మాలిన్ భాష, రాధా మధ్య గొడవలు జరుగుతుండడంతో రాధా సోదరులు.. అనేకసార్లు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా బావ మాలిన్ భాషా తీరులో మార్పు రాకపోవడంతో పాటు రాధాపై వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తమ అక్కను వేధిస్తున్నాడని బావ మాలిన్ భాషాపై రాధా సోదరులు దాడి చేశారు. ఆవేశంతో ఊగిపోయిన బావమరుదులు పూలకుండీతో బావ భాషా తలపై కొట్టారు. దీంతో మాలిన్ భాషా అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బావమరుదులు బావ బతుకు కోరుతారనే సామెతను.. ధర్మవరంలోని ఈ బావమరుదులు రివర్స్ చేశారు. అక్కను వేధిస్తున్నాడని బావమరుదులు ఇద్దరు కలిసి ఏకంగా బావనే కడతేర్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్ కీలక నిర్ణయం.. గ్రామానికో సర్పమిత్ర

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమాకి OTTలో అరుదైన రికార్డ్

Dude: ఎట్టకేలకు డ్యూడ్ సినిమా OTTలోకి.. డేట్స్ ఫిక్స్

Sharwanand: ఎట్టకేలకు విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వా

Abhishek Bachchan: నా హృదయం ముక్కలైంది.. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పోస్ట్