AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కీలక నిర్ణయం.. గ్రామానికో సర్పమిత్ర

పవన్ కీలక నిర్ణయం.. గ్రామానికో సర్పమిత్ర

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 3:17 PM

Share

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో 'హనుమాన్ ప్రాజెక్ట్' ప్రారంభమైంది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 'సర్పమిత్ర' వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. పాముకాటు మరణాలను తగ్గించి, మానవ-వన్యప్రాణుల సంఘర్షణను నివారించడమే లక్ష్యం. ఏఐ, డ్రోన్ వంటి సాంకేతికతతో సర్పాలను సురక్షితంగా పట్టి, అడవుల్లో వదులుతారు. ఇది ప్రజల భద్రతకు, ప్రాణి రక్షణకు తోడ్పడుతుంది.

ఏపీలో మనుషులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు సరికొత్తగా రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా, గ్రామ స్థాయిలో సర్పమిత్ర వాలంటీర్లను ఏర్పాటు చేయాలనీ ప్రణాళికలు చేసింది. నగరాల్లో ఇప్పటికే సక్సెస్ అయిన సర్ప రక్షణ వ్యవస్థను ఇక గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఫారెస్ట్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోను వాలంటీర్లను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.. మొట్టమొదటిసారి రాష్టంలో ఇలాంటి విసృత కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రజల భద్రతకు కూడా ప్రత్యక ఆదరణ వస్తుందని నిపుణుల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఫారెస్ట్ అధికారులు రూపొందించిన హనుమాన్ ప్రాజెక్ట్ మానవ, వన్యప్రాణుల మధ్య సమన్వయానికి విప్లవాత్మక చర్యకు చొరవచూపనుంది. ఈ ప్రాజెక్ట్ లోని 11 ముఖ్య అంశాల్లో సర్పమిత్ర వాళ్ళంటిర్లు ఒకటి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా పాముకాట్ల వలన 40 వేల మంది వరకు ఉంటున్నారు.ఈ మరణాలను జాతీయ ఆరోగ్య సమీక్షలు తెలియజేశాయి.. మానవుడు, వన్యప్రాణాల మధ్య సంఘర్షణలను తగ్గించేందుకు ఏఐ , డ్రోన్, రేడియో కాలర్‌లు, మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్స్‌లు వంటి సాకేతిక సాధనాలతో పాటు గ్రామస్థాయి వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారు. గ్రామాల్లో జనావాసాల్లోకి వచ్చే పాములు నుంచి ప్రజలకు ఎటువంటి హాని కలుగకుండా చూడడమే సర్పమిత్రల ప్రధాన విధి.. వీరు గ్రామాల్లోకి వచ్చిన పాములను పట్టుకొని సురక్షితంగా వాటిని అడవులలోకి వదిలేస్తారు. ఇది కేవలం ప్రాణి రక్షణకు మాత్రమే కాకుండా మునుషుల భద్రతకు కూడా దోహదపడుతుంది.. ప్రతి పంచాయితీలో ఒక్కొక్క వాలంటీరును ఎంపిక చేస్తారు.. స్థానిక ప్రజలతో మాట్లాడి వీరి విధులు నిర్వహిస్తారు. రాత్రి సమయాల్లో పాములు తిరగడం సాధారణం కాబట్టి వీరు అలర్టుగా ఉంటూ యాప్ ద్వారా అలర్ట్ లు పొందుతూ చర్యలు తీసుకుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమాకి OTTలో అరుదైన రికార్డ్

Dude: ఎట్టకేలకు డ్యూడ్ సినిమా OTTలోకి.. డేట్స్ ఫిక్స్

Sharwanand: ఎట్టకేలకు విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వా

Abhishek Bachchan: నా హృదయం ముక్కలైంది.. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పోస్ట్

ఉన్న వివాదం చాలదన్నట్టు 3 కోట్లు పెట్టి మరో లగ్జరీ కారు అవసరమా