Watch: కేఎఫ్‌సీలో కుమ్ములాట.. కస్టమర్‌తో సిబ్బంది ఫైట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రస్తుతంఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతమైన చర్చకు దారితీసింది. కొంతమంది వినియోగదారులు ఈ ఘర్షణను తమాషాగా భావించారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఎవరైనా అతన్ని రక్షించండి అని రాశారు. వీడియోపై కొందరు ఫన్నీగా స్పందిస్తే.. మరికొందరు సీరియస్ రియాక్షన్స్ ఇస్తున్నారు.
కేఎఫ్ సీ భోజన ప్రియులకు ఎంతో ఇష్టమైన ఫుడ్..దేశవ్యాప్తంగా కేఎఫ్‌సీని ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. అంతేకాదు.. ఈ ఫుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా మస్త్ క్రేజ్ ఉంది. కేఎఫ్‌సీ ఫుడ్స్ ప్రపంచవ్యాప్తంగా తమ బ్రాండ్ రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని ఓ కేఎఫ్‌సీ సెంటర్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో కేఎఫ్‌సీలో పనిచేసే వారికి, తమ ఫుడ్ ఆర్డర్ విషయంలో కస్టమర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. CCTVలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ విజువల్స్ ఇంటర్ ఇంటర్‌నెట్ వేదికగా వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న ఈ CCTV వీడియోలో KFC అవుట్‌లెట్‌లో గందరగోళం కనిపిస్తుంది. అక్కడ ఒక వ్యక్తి అందులో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై అరుస్తూ కౌంటర్ దాటి లోపలకు వెళ్లిపోయాడు. ఎదురుగా వచ్చిన వారిపై దాడి చేశాడు..దాంతో అక్కడ పెద్ద యుద్ధ వాతావరణమే ఏర్పడింది. అతడి దాడితో ఒక్కసారిగా కేఎఫ్‌సీ సిబ్బంది, ఉద్యోగులు మొత్తం దిగిపోయారు. అతన్ని ముందు వెనక అంటూ తేడా లేకుండా కుమ్మేశారు.. అతడు కూడా తగ్గకుండా వారిపై ఎదురు దాడి చేశాడు.. అంతలోనే సీనియర్ ఉద్యోగులు, లేడీస్ కూడా అక్కడకు వచ్చారు. వారంతా అతన్ని కొట్టకుండా అడ్డుకుని ఆపే ప్రయత్నం చేశారు. అతన్ని శాంతింప జేసే ప్రయత్నం చేశారు. ఇంతకీ గొడవకు గల కారణం ఏంటో మాత్రం తెలియరాలేదు. కానీ. గొడవ ఫుడ్ ఆర్డర్ విషయం అంటున్నారు.
ఈ వీడియో చూడండి..
Kalesh b/w KFC Staff and customer over Some order Related issues, Somewhere in Kerala
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 2, 2024
ఇదిలా ఉంటే, కేఎఫ్‌సీలో జరిగిన ఈ గొడవను కొందరు తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీయటం మొదలుపెట్టారు. ప్రస్తుతంఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతమైన చర్చకు దారితీసింది. కొంతమంది వినియోగదారులు ఈ ఘర్షణను తమాషాగా భావించారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఎవరైనా అతన్ని రక్షించండి అని రాశారు. వీడియోపై కొందరు ఫన్నీగా స్పందిస్తే.. మరికొందరు సీరియస్ రియాక్షన్స్ ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..