లవంగాలను రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. లవంగాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాదు.. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను లవంగం దూరం చేస్తుంది. లవంగం జీర్ణ సమస్యకు అద్భుతమైన ఔషధం.. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఖనిజాలను గ్రహిస్తుంది, ముఖ్యంగా అజీర్ణం, కడుపు గ్యాస్ మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.