Viral Video: తోడుకున్నోడికి తోడుకున్నంత.. ఏరులై పారిన డిజీల్.. ఎగబడ్డ జనం
పట్టాల వెంట ఆయిల్ ఏరులై పారింది. అది చూసిన స్థానికులు ఎగబడ్డారు. బిందేలు బక్కెట్లతో తోడుకుని వెళ్తున్నారు. ఆడ మగ అనే తేడా లేదు.. పిల్లలు పెద్దలు బారులు తీరారు.. బక్కెట్లతో డిజీల్ నింపుకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇది ఎక్కడ జరిగిందంటే..
గత కొన్ని నెలలుగా రైలు ప్రమాదానికి సంబంధించిన ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల కావాలనే కొందరు వ్యక్తులను రైలును పట్టాలు తప్పేలా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వర్షాలు, వరదల కారణంగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి తెలిసింది. ఢిల్లీ-ముంబయి లైన్‌లో పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తు్న్న గూడ్స్ రైలు.. రైల్వే యార్డు సమీపంలో ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది.
అయితే, పెట్రోలియం గూడ్స్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పటంతో బోగీల్లోంచి డిజీల్ లీకైంది. పట్టాల వెంట ఆయిల్ ఏరులై పారింది. అది చూసిన స్థానికులు ఎగబడ్డారు. బిందేలు బక్కెట్లతో తోడుకుని వెళ్తున్నారు. ఆడ మగ అనే తేడా లేదు.. పిల్లలు పెద్దలు బారులు తీరారు.. బక్కెట్లతో డిజీల్ నింపుకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి.
ఈ వీడియో చూడండి..
People loot diesel from 3 wagons of goods train that derailed in Madhya Pradesh’s Ratlam- #Watch.#MadhyaPradesh #Ratlam #Video #ViralVideo pic.twitter.com/4jdnEmnU1D
— TIMES NOW (@TimesNow) October 4, 2024
ఇదిలా ఉంటే, గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సంఘటనలో ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఘటనకు సంబంధించి రత్లామ్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) రజనీష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. వ్యాగన్ నుండి పెట్రోలియం లీక్ అవుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.ప్రమాదం జరిగిన రైల్వే లైన్ వెంట రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నామని, కొన్ని రైళ్లు కాస్త ఆలస్యం కావొచ్చునని ఆయన తెలిపారు.