బల్లి పిల్ల అనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు.. ! అసలు విషయం తెలిసి జుట్టుపీక్కుంటున్నాడు..

బల్లి పిల్ల అనుకున్న ఈ చిన్న జీవి పెరుతూ ఎలా మారిందో కూడా వీడియోలో చూపించారు. తొలుత ఈ జీవి చాలా చిన్నది. కానీ, క్రమంగా అది పెద్దదిగా పెరిగింది. ఈ జీవి పెద్దయ్యాక దాని అసలు రూపం బయటపడింది. వీడియోకు క్యాప్షన్ ప్రకారం, ఈ జీవి పెరుగుతున్న క్రమంలో వింత మార్పులు కనిపించాయి. అప్పుడే తెలిసింది అది బల్లి కాదని,

బల్లి పిల్ల అనుకుని ఇంటికి తెచ్చుకుని పెంచుకున్నాడు.. ! అసలు విషయం తెలిసి జుట్టుపీక్కుంటున్నాడు..
Lizard
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 14, 2024 | 9:44 AM

చాలా మంది కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, మేకలు మొదలైన జంతువులను పెంచుకోవటం సాధారణంగా చూస్తూనే ఉంటాము. అలాంటి పెంపుడు జంతువులను తమ ఇంట్లోని కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఇలాంటివి సాధారణమైనప్పటికీ, కొంతమంది ఇతర క్రూరమై జంతువులను కూడా పెంచుకోవడానికి ఇష్టపడతారు. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక వ్యక్తి బల్లిని పెంచుకోవాలని భావించాడు.. అందుకోసం నవజాత బల్లిని ఇంటికి తీసుకువచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బల్లి పిల్ల అని భావించి ఇంటికి తెచ్చినది అసలైన మొసలి పిల్ల అని తేలింది. ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఓ వ్యక్తి బల్లి ఆకారంలో ఉన్న చిన్న జీవిని తన ఇంటికి తీసుకెళ్లాడు.. అతను ఈ జీవిని బల్లి పిల్లగా భావించి ఎంతో ప్రేమతో పెంచుతున్నాడు. కానీ, క్రమంగా బల్లి పిల్ల అనుకున్న ఈ చిన్న జీవి పెరుతూ ఎలా మారిందో కూడా వీడియోలో చూపించారు. తొలుత ఈ జీవి చాలా చిన్నది. కానీ, క్రమంగా అది పెద్దదిగా పెరిగింది. ఈ జీవి పెద్దయ్యాక దాని అసలు రూపం బయటపడింది. వీడియోకు క్యాప్షన్ ప్రకారం, ఈ జీవి పెరుగుతున్న క్రమంలో వింత మార్పులు కనిపించాయి. అప్పుడే తెలిసింది అది బల్లి కాదని, అది ఒక మొసలి అని అర్థమైందని రాశారు. పెరుగుతున్న కొద్దీ చివరకు ఆ మొసలి అసలు రూపం బయటపడింది. అది మనిషి అంత ఎత్తుగా పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. చాలా మంది ఈ వీడియోను షేర్ చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అతను ముందుగా, ఆ జంతువు గురించి తెలుసుకోవాల్సింది అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, ఈ వీడియో చాలా ఫన్నీగా ఉందని మరి కొందరు అన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @AMAZlNGNATURE ద్వారా షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 21 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. ఈ వీడియోను 25 వేల మందికి పైగా లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..