AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇదేం మాయరా సామీ..! కొబ్బరి కాయను కేక్‌లా కట్‌చేస్తున్నారు..? వీడియో చూస్తే అవాక్కే..

సోషల్ మీడియాలో ఓ వింత వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడియోలో ముందుగా కొబ్బరి కాయ కనిపించింది. కానీ, అందులో మ్యాటర్‌ వేరే ఉంది.. కొబ్బరికాయలో ఏముంది..? అనే కదా మీ సందేహం..పైకి కనిపించే కొబ్బరికాయ అసలు విషయం ఏంటంటే.. అ

Watch: ఇదేం మాయరా సామీ..! కొబ్బరి కాయను కేక్‌లా కట్‌చేస్తున్నారు..? వీడియో చూస్తే అవాక్కే..
Cake That Looks Like Coconut
Jyothi Gadda
|

Updated on: Oct 14, 2024 | 8:50 AM

Share

మన దగ్గర భోజన ప్రియులు చాలా మంది ఉంటారు. కొంతమందికి ప్రత్యేక ఆహారం, పానీయాలు అంటే చాలా ఇష్టం. ఆహార ప్రియులు ఎన్నో రకాలుగా ఆహారాన్ని ట్రై చేయాలి అనుకుంటారు. అటువంటి వాళ్లలోనే కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసి సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిపోయారు. అలాగే, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం మరికొంతమంది చిత్ర విచిత్రమైన వంటకాలను తయారు చేస్తుంటారు..పైగా వాటిని వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. అలాంటిదే ఈ వింత వంటకం.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

సోషల్ మీడియాలో ఒక వంటకం వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీడియోలో ముందుగా కొబ్బరి కాయ కనిపించింది. కానీ, అందులో మ్యాటర్‌ వేరే ఉంది.. కొబ్బరికాయలో ఏముంది..? అనే కదా మీ సందేహం..పైకి కనిపించే కొబ్బరికాయ అసలు విషయం ఏంటంటే.. అది కమ్మటి, మెత్తటి కేక్. ఈ కేక్ ప్రత్యేక ఆకృతిని చూసి షాక్‌ అవుతున్నారా..? మీరు షాక్‌ అవ్వాల్సిన పనిలేదు..ఎందుకంటే.. నిజంగా ఇది కేకే.. దీనిని చూస్తే ఎవరైనా ఇది నిజమైన కొబ్బరికాయ అనుకుంటారు. ఈ గుండ్రటి కొబ్బరికాయ పైన గరుకు నారలాంటిది కూడా కనిపిస్తుంది. ఈ కేక్ తయారీ కంప్లీట్‌ రేసీపీని కూడా వీడియోలో చూపించారు.. ఈ వీడియో సృజనాత్మకమైనది. దానికదే ప్రత్యేకమైనది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి కాయ కేక్‌ తయారీ కోసం కొబ్బరికాయలోని ప్రతి భాగాన్ని ఎంతో జాగ్రత్తగా తయారు చేశారు. కేక్ వెలుపలి భాగం కూడా నిజమైన కొబ్బరికాయ లాగా కనిపిస్తుంది. కానీ, ఈ కొబ్బరికాయను కత్తితో కోస్తే లోపల బ్రెడ్, క్రీమ్ కనిపిస్తాయి. కొబ్బరి ముక్కలో ఉండే, తెల్లటి కొబ్బరి కూడా నిజమైన కొబ్బరి గుజ్జులా కనిపిస్తుంది. ఈ కేక్‌ వీడియో చూస్తేనే అర్థమవుతుంది..ఈ కేక్ తయారీలో కళాకారుడు చాలా కష్టపడ్డాడు అని.

ఇకపోతే, ఈ వీడియో సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోయి తమ స్పందనను తెలియజేస్తున్నారు. కొంతమంది ఈ కేక్‌ని కొనియాడుతుండగా, మరికొందరు ఈ కేక్‌ను ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరు దీనిపై స్పందిస్తూ..బయటి నుండి ఇది నిజంగా అచ్చం కొబ్బరి కాయ మాదిరిగానే ఉందని అన్నారు. ఇది కేక్ అని ఎవరూ కలలో కూడా ఊహించలేరు అంటూ మరొక వ్యక్తి పేర్కొన్నాడు. ఈ వీడియోను @diyacakesit అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసారు. ఈ వీడియో ఇప్పటికే1 లక్ష కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us