Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాలేజీకొచ్చిన గేదె..! క్లాసులు వింటానంటూ మారాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 9 మిలియన్లకు పైగా వ్యూస్, అనేక కామెంట్లు వచ్చాయి. ఒక వినియోగదారు సరదాగా వ్యాఖ్యానిస్తూ, బహుశా అది తన స్నేహితులను కలవడం కోసం వచ్చిందనుకుంటా అని కామెంట్‌ చేయగా, స్పాట్ ఇన్‌స్పెక్షన్‌కి వచ్చిన అధికారి అని మరొకరు చమత్కరించారు.

కాలేజీకొచ్చిన గేదె..! క్లాసులు వింటానంటూ మారాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Buffalo Enter In Classroom
Jyothi Gadda
|

Updated on: Oct 14, 2024 | 8:12 AM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం వైరల్ అవుతుంది. వీటిలో ఎక్కువ వీడియోలు చిత్ర విచిత్రమైనవే వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు ప్రజల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని జనాల్ని ఆలోచించేలా చేస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తరువాత మీరు నవ్వకుండా ఉండలేరు. పూర్తివివరాల్లోకి వెళితే..

స్కూలు, కాలేజీ క్లాస్‌రూముల్లోకి తరచూ పాములు, కోతులు, కుక్కలు వంటివి దూరి విద్యార్థుల్ని కంగారుపెట్టించిన వార్తలు అప్పుడప్పుడు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి తమాషా సంఘటన ఇటీవల జరిగింది. ఓ కాలేజీ క్లాస్‌ రూమ్‌లోకి గేదె వచ్చింది. అవును, విద్యార్థులంతా శ్రద్ధగా పాఠం వింటున్న సమయంలో ఊహించని విధంగా గేదె తరగతి గది లోపలి వరకూ వచ్చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గేదెకు కూడా మీ కాలేజీలో సీటు ఇవ్వండి అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. క్లాసులో గేదెను చూడగానే ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు. తరగతిలో ఉన్న పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది పిల్లలు భయపడిపోయారు. మరి కొందరు నవ్వుతున్నారు. అంతలోనే ఒక వ్యక్తి వచ్చి గేదెను పట్టుకుని క్లాస్‌ లోంచి బయటకు తీసుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by DOABA X08 (@doaba_x08)

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ doaba_x08 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 9 మిలియన్లకు పైగా వ్యూస్, అనేక కామెంట్లు వచ్చాయి. ఒక వినియోగదారు సరదాగా వ్యాఖ్యానిస్తూ, బహుశా అది తన స్నేహితులను కలవడం కోసం వచ్చిందనుకుంటా అని కామెంట్‌ చేయగా, స్పాట్ ఇన్‌స్పెక్షన్‌కి వచ్చిన అధికారి అని మరొకరు చమత్కరించారు. ఈ సీన్ చూసి చాలా మంది పగలబడి నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..