అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ఫుల్ ట్రైనింగ్

అందమే పెట్టుబడి.. అబ్బాయిలే టార్గెట్.! ఎలా వలలో వేసుకోవాలో ఫుల్ ట్రైనింగ్

Anil kumar poka

|

Updated on: Oct 14, 2024 | 9:11 AM

పేరు జాయ్‌ జెమిమా. వయసు 27ఏళ్లు. అందమే పెట్టుబడి.. సంపన్న వర్గాలే టార్గెట్‌.. ముగ్గులోకి దింపడానికో స్కెచ్చు. ఉన్నదంతా ఊడ్చేసి పరారవడమే బిజినెస్ ట్రిక్. మొన్న విశాఖలో బైటపడ్డ ఈ హానీ ట్రాప్‌ దందా.. స్థానికులని బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు తామూ ఆ జెమియా బాధితులమేనంటూ పలువురు స్టేషన్‌కు క్యూ కడుతుండటం పోలీసులను షాక్‌కు గురిచేస్తోంది. ఆ కిలాడీ అరెస్ట్‌ కావడంతోనే.. బాధితులు బయటకొస్తున్నారు.

పేరు జాయ్‌ జెమిమా. వయసు 27ఏళ్లు. అందమే పెట్టుబడి.. సంపన్న వర్గాలే టార్గెట్‌.. ముగ్గులోకి దింపడానికో స్కెచ్చు. ఉన్నదంతా ఊడ్చేసి పరారవడమే బిజినెస్ ట్రిక్. మొన్న విశాఖలో బైటపడ్డ ఈ హానీ ట్రాప్‌ దందా.. స్థానికులని బెంబేలెత్తిస్తోంది. అంతేకాదు తామూ ఆ జెమియా బాధితులమేనంటూ పలువురు స్టేషన్‌కు క్యూ కడుతుండటం పోలీసులను షాక్‌కు గురిచేస్తోంది. ఆ కిలాడీ అరెస్ట్‌ కావడంతోనే.. బాధితులు బయటకొస్తున్నారు.

ఇక కేసును ఫుల్‌ సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగానే ఈ హనీట్రాప్‌ ముఠా.. నెట్‌వర్క్‌ నడిపిస్తున్నట్లు గుర్తించారు. డిజిటల్‌ మార్కెటింగ్ చేస్తున్నానంటూ డబ్బున్న యువకులను పరిచయం చేసుకుని ట్రాప్‌ చేస్తున్నట్లు తెలిపారు. మాయలేడీ వేధింపులు తట్టుకోలేక ఒడిశా పారిపోయానంటూ ఓ బాధితుడు ఆశ్రయించడంతో పోలీసులే బిత్తరపోయారు.

బెదిరించిన ప్రతీసారి లక్షల్లో సమర్పించుకున్నానని చెప్పడంతో.. ఆమె ఆన్‌లైన్ లావాదేవీల‌పై నిఘా పెట్టారు. న‌గ‌దు లావాదేవీల‌పైనా ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని పలువురు యువకులను కూడా ట్రాప్‌‌‌‌ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులకు విశాఖ సీపీ బాగ్చి సమాచారం అందించారు. నిందితురాలి బ్యాంకు ఖాతాల్లోని క్యాష్‌‌‌‌ను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.

ఈ వ్యవ‌హారంలో చాలా మంది యువ‌కులు చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నిందితుల ఆన్‌లైన్ లావాదేవీల‌పై పోలీసులు నిఘా పెట్టారు. వారి న‌గ‌దు లావాదేవీల‌పై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌‌‌‌లోని పలువురు యువకులను కూడా ట్రాప్‌‌‌‌ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ పోలీసులకు విశాఖ సీపీ బాగ్చి సమాచారం అందించారు. నిందితురాలి బ్యాంకు ఖాతాల్లోని క్యాష్‌‌‌‌ను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు.

హనీట్రాప్‌ అంటే ఇది రోటీన్‌గా జరిగే హనీట్రాప్ కాదు. ఫుల్లీ అప్‌డేటెడ్ హనీట్రాప్. ముగ్గులోకి దింపడం.. ఫిజికల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవడం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌తో లక్షలకు లక్షలు గుంజడం. హనీట్రాపర్లు పాటించే ప్రాథమిక లక్షణం. కానీ.. ఈ జిగేల్ రాణి హనీట్రాప్ అంతకుమించిన ఇంట్రస్టింగ్ టాపిక్. ఎందుకంటే.. పెళ్లి చేసుకుందాం రా అంటూ సీక్వెల్ కూడా ఉందిక్కడ. ఇంతవరకు పెళ్లయిన మగాళ్ల మీద విసిరే వలపు వల గురించే విన్నాం. ఇది పెళ్లికాని ప్రసాదులే టార్గెట్‌గా జరిగిన హానీట్రాప్‌ దాడి.

విశాఖలో ముసుగుసుందరి మాయలో పడి నిలువుదోపిడి సమర్పించుకున్న ఒక ఎన్నారై ఉద్యోగి సంఘటనతో తొలుత హానీట్రాప్‌ బయటపడింది. విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఎన్నారై ఫ్యామిలి.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. జిగేల్ రాణి వలపువలకు చిక్కేశాడు. తన పేరు కొరుప్రోలు జాయ్ జెమీమా అని.. మీ ఇంటికి దగ్గర్లోనే మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీలో ఉంటున్నా.. అంటూ పరిచయం పెంచుకుంది. ఈలోగా ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రుల్ని కూడా మాటల్లో పెట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.