Bus Rush: వరస సెలవులతో బస్సుల్లో రద్దీ.. నిలబడే చోటు లేక పిల్లాడిని లగేజీ క్యారియర్‌లో పెట్టిన స్త్రీ..
బస్సులు రద్దీగా ఉండడంతో సీట్లు దొరక్క ప్రయాణికులు నానా ఇబ్బంది పడుతున్నారు. కొందరు బస్సులో నిల్చుని వేలాడుతూ కూడా ప్రయాణం చేస్తున్నారు. అయితే కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. బస్సు ప్రయాణీకులతో నిండిపోయింది. దీంతో ఒక మహిళ తన బిడ్డను బస్సులో లగేజీ పెట్టుకునే క్యారియర్‌పై ఎక్కించి పడుకోబెట్టింది. ఈ బస్సు రాయచూర్ జిల్లా కలబురగి నుంచి లింగసాగూరు వెళ్తోంది.

శని ఆదివారాలలో పాటు ఉగాది, రంజాన్ పండగలు వరసగా రావడంతో లాంగ్ వీకెండ్ వచ్చింది. ఈ పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు. దీంతో బస్సులు ప్రయాణీకులతో నిండిపోతున్నాయి. బస్సులు రద్దీగా ఉండడంతో సీట్లు దొరక్క ప్రయాణికులు నానా ఇబ్బంది పడుతున్నారు. కొందరు బస్సులో నిల్చుని వేలాడుతూ కూడా ప్రయాణం చేస్తున్నారు. అయితే కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. బస్సు ప్రయాణీకులతో నిండిపోయింది. దీంతో ఒక మహిళ తన బిడ్డను బస్సులో లగేజీ పెట్టుకునే క్యారియర్‌పై ఎక్కించి పడుకోబెట్టింది. ఈ బస్సు రాయచూర్ జిల్లా కలబురగి నుంచి లింగసాగూరు వెళ్తోంది. ఓ మహిళ తన బిడ్డను లగేజీ క్యారియర్‌లో పెట్టి ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
సోమవారం ఉగాది పండగ శక్తి యోజన ఫలితంగా రాయచూరులో కూడా చాలా వరకు ప్రభుత్వ బస్సులు ఫుల్ రష్ గా ఉన్నాయి. దీంతో లింగసాగూరు-కలబుర్గి మార్గంలో వెళ్లే బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. మరోవైపు బయట వేడిగా ఉండేది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది. బాగా బస్సులో రద్దీ ఉండడంతో ఒకరినొకరు తోసుకుంటూ ప్రయాణీకులు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో ఒక స్త్రీ తన బిడ్డతో బస్సు ఎక్కింది.. సీటు దొరకక పోవడంతో నిలబడిన ఆ మహిళ బిడ్డతో ప్రయాణించడం కష్టంగా ఉందని భావించినట్లు ఉంది.. లగేజీని పెట్టే క్యారియర్‌లో తన బాబుని పడుకోబెట్టింది. ప్రయాణీకులు కూడా మహిళ ఆలోచనకు షాక్ తిన్నారు. ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం లగేజీ క్యారియర్‌లో చిన్నారి నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




