Viral: రైతా.. మజాకా..! కారు రూ.10 కాదంటూ అవమానించిన సేల్స్‌మ్యాన్.. గంటలో దిమ్మతిరిగే షాక్
చిరంజీవి నటించిన 'స్నేహం కోసం' 'మూవీ మీలో ఎంతమంది చూశారు. మెగాస్టార్ సినిమా కాబట్టి అందరూ మాగ్జిమమ్ కవర్ చేసే ఉంటారు. అందులో ఓ క్రేజీ సీన్ ఉంటుంది.
చిరంజీవి నటించిన ‘స్నేహం కోసం’ మూవీ మీలో ఎంతమంది చూశారు. మెగాస్టార్ సినిమా కాబట్టి అందరూ మాగ్జిమమ్ కవర్ చేసే ఉంటారు. అందులో ఓ క్రేజీ సీన్ ఉంటుంది. మిత్రులైన చిరంజీవి, విజయ్ కుమార్ కలిసి కారు కొనేందుకు ఓ షోరూమ్‌కు వెళ్లగా.. వారి వేషధారణ, మాట తీరు చూసి అక్కడి సిబ్బంది అవమానిస్తారు. ఆ తర్వాత.. గోనె సంచిలో నుంచి డబ్బుల కట్టలు కిందపోయగా.. ఒకింత షాకై.. తప్పు తెలుసుకుని కారును విక్రయిస్తారు. సేమ్ ఇలాంటి సీనే రియల్ లైఫ్ లోనూ జరిగింది. కర్ణాటకలోని తుముకూర్‌లో గల మహీంద్రా షోరూమ్ ఇందుకు వేదికైంది. మహీంద్రా బొలెరో కొనేందుకు ఓ రైతు షోరూమ్‌కు వెళ్లగా.. అక్కడి సేల్స్‌మ్యాన్ కాస్త అతిగా ప్రవర్తించాడు.
కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వేషధారణపై సెటైర్ వేస్తూ అక్కడి సేల్స్‌మ్యాన్ అవమానకరంగా మాట్లాడాడు. అంతేకాదు.. కారు ధర 10 రూపాయలు అనుకుని వచ్చినట్లు ఉన్నారు.. ఇక బయలుదేరండి అంటూ మాట తూలాడు. కారు కొనేందుకు ఇంత మంది రారని ఆ రైతు స్నేహితులను ఉద్దేశించి హేళనగా మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. ఆ సేల్స్‌మ్యాన్ ఒకరి కింద నౌకరి చేస్తున్నాడు కానీ.. రైతు తన పొలంతో తాను సాగు చేసుకుంటూ జమిందారీలా బ్రతకుతాడు. అందుకే రైతులకు ఆత్మాభిమానం ఎక్కువ. ఈ క్రమంలో సేల్స్‌మ్యాన్ అన్న మాటలకు రైతు కెంపెగౌడకు పట్టలేని కోపం వచ్చింది. గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని షోరూమ్ సిబ్బందిని డిమాండ్ చేశారు. రైతు నుంచి ఊహించని విధంగా వచ్చిన ఈ రిప్లైకి షాకైన సిబ్బంది.. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిన రైతు.. తుముకూర్లోని తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో షోరూమ్ సిబ్బందిపై కంప్లైంట్ చేశారు. దీంతో సేల్స్‌మ్యాన్, ఇతర ఉద్యోగులు తమ తప్పు తెలుసుకున్నారు. కెంపెగౌడకు బహిరంగా క్షమాపణలు చెప్పారు. అంతేకాదు రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు. రైతా.. మజాకా..!
Also Read: హెల్మెట్ పెట్టుకోలేదని సీఐ కొడుకు బైక్ ఆపిన కానిస్టేబుల్.. అతగాడి ఓవరాక్షన్ చూడండి