Viral Video: చిన్నారి కరాటేను చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అందులో తండ్రి కూడా పిల్లలకు నేర్పే విధానం కూడా చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి అలవర్చుకునే అలవాట్లు..

Viral Video: చిన్నారి కరాటేను చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌
Viral Video
Follow us
Subhash Goud

|

Updated on: Aug 11, 2022 | 8:51 PM

Viral Video: పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. అందులో తండ్రి కూడా పిల్లలకు నేర్పే విధానం కూడా చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి అలవర్చుకునే అలవాట్లు వారిలో ఎంతో మార్పు తీసుకువస్తుంటుంది. నడవడిక కానివ్వండి.. ఆటలు కానివ్వండి.. మరేదైనా సరే చిన్నప్పటి నుంచి నేర్పించే అలవాట్లు వారి భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చదువు, గేమ్స్‌లు వారి జీవితాలను మారుస్తాయి. ఇక చదువుల్లో, ఆటల్లో రాణించాలంటే శిక్షకుడి పాత్ర కూడా ఎంతో కీలకం. ఆటల్లో రాణించాలంటే శిక్షకుడి నేర్పించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇక కొన్ని కొన్ని పిల్లల వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. వారు చేసే చేష్టలు, వారి ఆటలు అబ్బుర పరుస్తాయి. తాజాగా ఓ చిన్నారి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బుడిబుడి నడకలు వేసే ఆ చిన్నారి ఇప్పటి నుంచే కరాటేలో మేలుకువలు నేర్చుకుంటోంది. ఇక్కడ కనిపించే వీడియోలో ఓ చిన్నారి ఇప్పటి నుంచే కరాటే శిక్షణను అలవర్చుకుంటోంది. ఇందులో ఆ చిన్నారి చేసే కరాటేను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఇవి కూడా చదవండి

గులాబీ రంగు దుస్తులు ధరించిన ఆ చిన్నారి తన ట్రైనర్‌తో కలిసి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ చిన్నారిని చూస్తేంటే ప్రొఫెషనల్‌ లాగా ప్రతి కదలిక అందరిని అబ్బురపరుస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ చిన్నారితో పాటు ట్రైనర్‌ను సైతం ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి