నాలో ఓ మహిళ ఉంది: కరణ్ జోహార్
న్యూఢిల్లీ: మీరు స్వలింగ సంపర్కులా అన్న ప్రశ్నకు బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తనదైన శైలిలో స్పందించారు. తాను అబ్బాయిగా పుట్టానని, అందుకు గర్వంగా ఉందని చెప్పారు. అయితే తనలో ఓ మహిళ కూడా ఉందని, అది తనను ఒక మగాడిగా మరింత బలపరుస్తుందని తెలిపారు. తనపై వస్తున్న కామెంట్లు చూస్తే బాధ వేస్తుందని, గతంలో చాలా కోపం వచ్చేది కానీ ఇప్పుడు నవ్వు వస్తుందని చెప్పారు. తన గురించి మాట్లాడుకునే హక్కు అందరికీ […]

న్యూఢిల్లీ: మీరు స్వలింగ సంపర్కులా అన్న ప్రశ్నకు బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తనదైన శైలిలో స్పందించారు. తాను అబ్బాయిగా పుట్టానని, అందుకు గర్వంగా ఉందని చెప్పారు. అయితే తనలో ఓ మహిళ కూడా ఉందని, అది తనను ఒక మగాడిగా మరింత బలపరుస్తుందని తెలిపారు. తనపై వస్తున్న కామెంట్లు చూస్తే బాధ వేస్తుందని, గతంలో చాలా కోపం వచ్చేది కానీ ఇప్పుడు నవ్వు వస్తుందని చెప్పారు.
తన గురించి మాట్లాడుకునే హక్కు అందరికీ ఉంది, అయితే తనలో ఏదో లోపం ఉంది అన్నట్టుగా ప్రచారం చేయొద్దని కోరారు. తన పిల్లలపై ఎవరైనా కామెంట్ చేస్తే కొపం వస్తుందని, తన పిల్లల విషయంలో చాలా సున్నితంగా ఉంటానని చెప్పారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘పించ్’ అనే కార్యక్రమంలో కరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో నెటిజన్ల చేసిన పలు కామెంట్లను ఆయన కరణ్‌కు వినిపించారు. అందులో మీరు స్వలింగ సంపర్కులా? అన్న ప్రశ్న కూడా ఉంది.