Viral: స్కూల్లోని విలువైన వస్తువులు దోచేసిన దొంగలు.. వెళ్తూ.. వెళ్తూ క్లాస్ రూమ్స్‌లోని బ్లాక్ బోర్డులపై…
సౌండ్ బాక్సులు సహా పలు సామాన్లు చోరీ చేశారు దొంగలు. వెళ్తూ.. వెళ్తూ... పక్కనే ఉన్న తరగతి గదుల బ్లాక్బోర్డులపై వారు రాసింది చూసి అందరూ స్టన్ అయ్యారు.

Trending: ఈ మధ్య దొంగలు విచిత్రంగా తయారయ్యారు. చోరికి వచ్చి తుంటరి పనులు చేస్తున్నారు. విచిత్రమైన పనులతో పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఒడిశా(Odisha)లోని నవరంగ్పుర్(Nabarangpur)లో దొంగలు తమ చేతివాటం చూపించారు. శుక్రవారం జగన్నాథుని రథయాత్ర సందర్భంగా సెలవు ఉన్న నేపథ్యంలో నవరంగ్పుర్ స్కూల్‌ను టార్గెట్ చేశారు. కంప్యూటర్లు, జిరాక్స్ మెషీన్లు, సౌండ్ బాక్సులు ఎత్తుకెళ్లిపోయారు. అయితే పోతూ.. పోతూ క్లాస్ రూమ్స్‌లోని బ్లాక్ బోర్డుపై.. ‘ధూమ్-4 త్వరలోనే రాబోతుంది’ అంటూ రాసివెళ్లారు. శనివారం ఉదయాన్నే స్కూలుకు వచ్చిన స్టాఫ్, టీచర్స్ వస్తువులు చోరీ అయినట్లు గుర్తించారు. ఆ తర్వాత బ్లాక్బోర్డులపై దొంగలు రాసింది చూసి స్టన్ అయ్యారు. దీంతో స్కూల్ యాజమాన్యం ఖతీగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఖతీగూడ పోలీసులు.. డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు. దగ్గర్లోని సీసీ కెమెరాల్లోని విజువల్స్ పరిశీలిస్తున్నారు. దొంగలు ఎత్తుకెళ్లిన కంప్యూటర్లలో విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలు, ఎగ్జామ్ పేపర్స్, పాఠశాల సమాచారం ఉందని ప్రిన్సిపల్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..
