AP News: పెళ్లి విందులో మెనూ కార్డ్…రిసెప్షన్ కు రండి మా వంటకాలు రుచి చూడమంటూ ఇన్విటేషన్…ఎక్కడో తెలుసా?
పెళ్లికి వెళ్తున్నాం అంటే..మొదటగా అబ్బాయి, అమ్మాయి ఎవరని మాట్లాడుకుంటాం.. ఆ తర్వాత కట్నాలు కానుకలు. కానీ పెళ్లికి వచ్చిన వారు తర్వాత ఇవేవి గుర్తుంచుకోరు పెళ్లిల్లో పెట్టిన భోజనం గురించే మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు మనం పెట్టే భోజనం ఎలా ఉండాలి..మనం పెట్టిన భోజనం బాలేదని..వేస్ట్ చేయకుండా..దాన్ని తిన్న అందరూ ఆహా అనాలి కాదా..ఇక్కడ ఓ వ్యక్తి చేసిన ఆ లోచన కూడా అలానే ఉంది..తన కొడుకు రిసెప్షన్‌కు వచ్చే వారు అక్కడ ఏం పెడతారో తెలియక ఫుడ్‌ను వేస్ట్ చేయకూడదని..రిసెప్షన్‌లో పెట్టబోయే భోజనాల గురించి ముందుగానే ఇన్విటేషన్ కార్డులో ప్రింట్ చేయించాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారు ఫుడ్ వేస్ట్ చేయండా తినేలా చూసుకున్నాడు.

ఏరా పప్పన్నం ఎపుడు పెడతావు ….ఈ పలకరింపు గ్రామాల్లో తరుచుగా వినిపిస్తుంది. ఇక సిటిల్లో అయితే మీ వాడికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు, పెళ్లి ఎపుడు చేసుకుంటావ్ అనే చర్చలు జరుగుతుంతాయి. ఇక్కడ పెళ్లి అనేది కామన్ అనిపించినా.. పెళ్లిల్ల సమయంలో పెట్టే పప్పన్నంకి మన పెద్దలు విశేష ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పటి వివాహ వేడుకల్లో అతిథికి ఏది నచ్చుతుందో తెలియకపోయినా కామన్ గా వెజ్ బిర్యాని అందులోనూ పలు రకాల కూరలు, వేపుళ్లు, స్వీట్లు, హాట్లు ఇలా విస్తరినిండా ఎన్ని వెరైటీలు వడ్డించామని చూస్తున్నారే కాని… అతిధి ఎంత త్రృప్తిగా తిని వెళ్లారనే దాని గురించి మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. కానీ దీని గురించి ఇక్కడో వ్యక్తి ఆలోచించాడు. పెళ్లికి వచ్చే వారికి ఓ వెరైటీ ఇన్విటేషన్ పంపించాడు. ఆ ఇన్విటేషన్ ఏంటో చూసేద్దామా…
ఏలూరు జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన కోడూరి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తన కుమారుడి వివాహం రిసెప్షన్‌కు వచ్చే అతిథులు సంత్రుప్తిగా తిని వెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు. రిసెప్షన్‌లో ఏమేమి వడ్డిస్తారో అనేది ఆహ్వానితులకు ఇచ్చే ఇన్విటేషన్ కార్డులో ముందే ప్రింట్ చేయించాడు. అంతేకాదు వారు పెట్టే విందు భోజనం విశిష్టత కూడా అందులో రాయించాడు. రిసెప్షన్‌కు వచ్చే వారు ఫుడ్ నచ్చక ఆహారపదార్థాలు వేస్ట్ చేయకుండా ఉండేందుకు..వచ్చిన వారు సంతృప్తిగా తిని వెళ్లేందుకు లక్ష్మినారాయణ ఇలా వినూత్నంగా ఆలోచించారు.
మన సాంప్రదాయంలో పెళ్లి కేవలం పురుషుడు, స్త్రీని ఒక్కటిగా చేసే వేదిక మాత్రమే కాదు ఈ సందర్బంగా నిర్వహించే ప్రతి కార్యక్రామానికి తగిన ప్రయోజనం ఉంటుంది. కొందరు పెళ్లి మంత్రాలను, భార్యా భర్తల సంబంధం తెలియచేసే సందేశాలను పెళ్లి కార్డులో వేస్తే.. మరికొందరు విందు భోజనం విశిష్టత ప్రస్తావిస్తారు. ఏదిఏమైనా “వివాహ భోజనంబు వింతైన వంటకంబు …హహహ నాకే ముందు అంటూ ఘటోత్కచుడిగా మెప్పించిన యస్వీఆర్”… పులిహోర, గారెలు, లడ్డూలు ఇలా ఎన్నో రకాల వంటకాలు ప్రస్తావించారంటే అప్పట్లో వాటిని సాంప్రదాయంగా పెళ్లిలో వడ్డించారనే విషయం మనకు తెలుస్తుంది.
ఇక కోడూరి లక్ష్మీనారాయణ విందు భోజనం ఎలా ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈయన గతంలో బీజేపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అధ్యక్షుడు గా పని చేయటంతో రాజకీయ నాయకులు సైతం ఈ విందు కు భారీగా హాజరయినట్టు చెప్పుకుంటున్నారు.
మరిన్న ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..