Viral News: రూ. 4 లక్షల కోట్లకు అధినేత.. కానీ ఆయన సింప్లిసిటీ చూస్తే..
ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన సంస్థ వ్యవస్థాపకులు, ఆయన ఆస్తి సుమారు రూ. 4 లక్షల కోట్లు, ఆయన అల్లుడు యూకే దేశానికి ప్రధాని.. కానీ ఆయన సింప్లిసిటీ చూస్తే మాత్రం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుటికే అర్థమై పోయింటుంది కదూ.! అవును అతను మరెవరో కాదు...

‘ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలని’ పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ రోజుల్లో అలాంటి వారు ఎక్కడున్నారు. అనవసరపు ఆడంబరాలు, ఎవరి మెప్పుకోసమే లేనిది ఉన్నట్లు చూపించుకోవడాలు సమాజంలో ఇలాంటి మనుషులు ఎక్కువైపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం నిరాండబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరాయన.? ఆయన ఏం చేశారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన సంస్థ వ్యవస్థాపకులు, ఆయన ఆస్తి సుమారు రూ. 4 లక్షల కోట్లు, ఆయన అల్లుడు యూకే దేశానికి ప్రధాని.. కానీ ఆయన సింప్లిసిటీ చూస్తే మాత్రం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పుటికే అర్థమై పోయింటుంది కదూ.! అవును అతను మరెవరో కాదు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయమూర్తి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ను ఏర్పాటు చేసి, వేలాది మందికి ఉద్యోగాలను అందిస్తున్న నారాయణమూర్తి ఇటీవల ఓ విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.
నరేన్ కృష్ణ అనే ఓ స్టార్టప్ కంపెనీ సీఈఓ ఇటీవల ముంబయి నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో బయలుదేరారు. అయితే అదే సమయంలో అతను కూర్చున్న సీటు పక్కన సీట్లో ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి కూర్చున్నాడు. ఇది గమనించి నరేన్ కృష్ణ.. నారాయణ మూర్తితో ఓ సెల్ఫీ తీసుకొని తన అనుభవాన్ని లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేశారు. నారాయణమూర్తి నిరాడంబరతరకు ఇది నిదర్శనమని ఆయన పోస్ట్ చేశారు.
ఇక ఆ ప్రయాణం జీవితంలో మరిచిపోలేదని చెప్పుకొచ్చిన నరేన్ కృష్ణా.. ఆ కొన్ని గంటల్లో నారాయణమూర్తి నుంచి ఎన్నో అద్భుత విషయాలను తెలుసుకున్నాను అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తును ఎలా నిర్దేశించనుందన్న విషయం మొదలు.. భారత ఆర్థిక వ్యవస్థలో యువత పాత్ర, రానున్న రోజుల్లో ఇండియన్ ఎకానమీ చైనాను అధిగమించడం వరకు ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నాము అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నరేన్ కృష్ణా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. చిన్న చిన్న సెలబ్రిటీలే స్పెషల్ ఫ్లైట్స్‌లో తిరుగుతున్న రోజుల్లో అంత సంపాదన ఉండి కూడా ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేయడం నిజంగానే గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
