Viral News: ఈ చిత్రం చూశారా గురూ..! నీళ్ల మీద బండి నడిపిన మోతెవరి

ఇంత ప్రమాదకర రూట్లో వెళ్లకపోవడమే మంచిది. అక్కడ ఏదో చెక్క వంతెన ఉన్నట్లుంది. అది కూడా చాలావరకు మునిగిపోయింది. అయినా కానీ ఆ వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేశాడు. మధ్యలో చిన్న మిస్టేక్ జరిగినా పెను ప్రమాదం జరిగేది.

Viral News: ఈ చిత్రం చూశారా గురూ..! నీళ్ల మీద బండి నడిపిన మోతెవరి
Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 09, 2023 | 5:54 PM

మన వద్ద ట్యాలెంటును సూపెట్టెటోల్లకు కొదవే లేదు. అమ్మనాన్నలు బండ్లు కొనిపెట్టి, చక్కగా కొలువు చేసుకోమంటే.. జర్క్‌లు ఇచ్చుకుంటూ అమ్మాయిలు ముందు శకలు పడేవాళ్లు మనకు తారసపడుతూనే ఉంటారు. బైక్ ముందు చక్రం గాల్లోకి లేపి.. రేసింగ్స్ చేసే అతిగాళ్ల చిల్లర స్టంట్లు చూస్తానే ఉంటాం. సర్కస్ చేసేవాళ్లు బతుకు దెరువు కోసం బండ్లను గాల్లోకి లేపడం కూడా చూసే ఉంటారు. కానీ ఇప్పటివరకు యాడా చూడని స్టంట్‌ను ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్నాం.

అక్కడ స్పేస్ లేదు.. కానీ తీసుకున్నడు. అక్కడ దారి లేదు కానీ ఆ నీటి మార్గం గుండానే బైక్‌పై ఇంటికి పోవాలనుకున్నడు. రోడ్ల మీద బైక్ నడిపెటోల్లను చూశాం, బండ్లకు తాళ్లు కట్టి గాల్లో ఎగ్రిచ్చెటోల్లను, సర్కస్‌లో గుండ్రంగా తిప్పెటోల్లను గూడ చూసే ఉంటాం కానీ.. నీళ్లను లెక్కజెయ్యకుంట నదిలోనే బండిని నడ్పిండు ఈ మోతెవరి. ఆయింత మధ్యలో నీళ్లు ఎక్కువ ఉన్నట్లుయితే పెద్ద ప్రమాదమే జరిగేది. అంతేకాదు ఇంజన్‌లోకి, సైలెన్సర్‌లోకి నీళ్లు పోయి బండి ఆగిపోతే..  వెనక్కు రాలేక.. ముందుకు పోలేక చుక్కలు కనపడేవి. మరి ఈ వాటర్ రైడర్ వీడియో ఎక్కడిదో ఏమో తెలియదు కానీ ప్రజంట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఆ బండి కంపెనీ వాళ్ల కళ్లల్లో పడితే… మా బండ్లు నీళ్లల్లో కూడా నడుస్తాయ్ అని ప్రచారం చేసుకున్నా చేసుకుంటారు. ఈ బైకు నడిపిన వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్గ పెట్టుకున్నా పెట్టుకుంటరు కావచ్చు. ఇలాంటి జాతి రత్నాలంటే మనకాడ్నే ఉంటారు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..