Monkey Revenge: అమ్మబాబోయ్.. పగతో రగిలిన కోతులు.. ఏకంగా 250 కుక్కలను మాయం చేశాయి..!
Monkey Revenge: కుక్క పిల్లలపై కోతులు పగ బట్టాయి. ఆ పగతో రగిలిపోయి ఒకటి కాదు.. రెండు కాదు..
Monkey Revenge: కుక్క పిల్లలపై కోతులు పగ బట్టాయి. ఆ పగతో రగిలిపోయి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250 కుక్కలను చంపేశాయి. అవును మీరు వింటున్నది నిజమే. 250 కుక్క పిల్లల్ని కోతుల గుంపు టార్గెట్ చేసాయి. కోతులు కుక్కలకు మధ్య వైరం ఉంటుందని విన్నాం. కోతి కనిపిస్తే చాలు కుక్కలు వెంటపడి మరీ తరుముతాయి. కానీ కుక్కపిల్లలపై కోతుల గుంపు పగ తీర్చుకోవడం వినడానికే వింతగా ఉన్నా.. వాస్తవం!
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్‌గావ్‌లో గత నెలలో ఓ కోతి పిల్లను కొన్ని కుక్కలు కలిసి వెంటాడి హతమార్చాయి. అది కళ్లారా చూసిన కోతులు ఆ కుక్కలపై పగ పెంచుకున్నాయి. వాటిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యాయి. పగతో రగిపోతున్న ఆ కోతులు.. కుక్క పిల్లలను ఎత్తుకెళ్ళడం మొదలుపెట్టాయి. అలా ఎత్తుకెళ్ళిన కుక్కపిల్లల్ని ఎత్తైన భవనాలపైకి ఎక్కించి.. అక్కడ నుంచి కింద పడేసాయి. పొడవాటి చెట్లపైకి ఎక్కి అక్కడి నుంచి వాటిని వదిలేసాయి. అలా 250 కుక్క పిల్లల ఆచూకీ తెలియకుండా పోయింది.
అయితే, కుక్కల మిస్సింగ్ గురించి ఆందోళన చెందిన గ్రామస్తులకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. కోతులే కుక్క పిల్లలను చంపాయని తెలుసుకుని అవాక్కయ్యారు. ఏం చేయాలో తెలియక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగినప్పటికీ.. ఏం చేయలేకపోయారు. ఒక్కటంటే ఒక్క కోతిని కూడా పట్టుకోలేకపోయారు. పైగా మరో విషయం ఏంటంటే.. కుక్క పిల్లల్ని మాయం చేసిన కోతులు.. ఆ తర్వాత ఊళ్లో ఉన్న చిన్నపిల్లల పై తమ ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాయట. స్కూల్‌కి వెళ్లే పిల్లలపై దాడులు చేయడం వంటివి చేశాయట. దీంతో గ్రామస్థులు కోతులు ఎక్కడ కనిపిస్తే అక్కడ తరమడం మొదలు పెట్టారు. మాస్టర్ ప్లాన్‌తో ప్రస్తుతానికి కోతుల బెడద తగ్గిందంటూ గ్రామస్తులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
Also read:
Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్
MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు