AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Currency Notes: ఈ పాత కరెన్సీ నోట్లు మీ వద్దన్నాయా? ఉంటే 10 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. అదెలాగంటే..

Currency Notes: పాత నాణేలు, పాత కరెన్సీ నోట్లు విక్రయించడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనే వార్తలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి చాలా మందికి పురాత

Currency Notes: ఈ పాత కరెన్సీ నోట్లు మీ వద్దన్నాయా? ఉంటే 10 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. అదెలాగంటే..
Currency 100
Shiva Prajapati
|

Updated on: Sep 22, 2021 | 1:47 PM

Share

Currency Notes: పాత నాణేలు, పాత కరెన్సీ నోట్లు విక్రయించడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనే వార్తలు మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి చాలా మందికి పురాత నాణేలు, నోట్లను సేకరించడం చాలా ఇష్టం. అరుదైన వస్తువుల సేకరణ కోసం వారు లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. ఇక అరుదైన నాణేలు, నోట్లను కొనడానికి, విక్రయించడానికి అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా క్వికర్, ఈబే, ఓల్క్స్, ఇండియన్‌ కాయిన్‌మిల్ వంటి వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇదిలాఉంటే.. పాత 100 రూపాయల నోటు గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇవాళ మనం దాని గురించి తెలుసుకుందాం..

ఆర్బీఐ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 రూపాయల నోట్లు అనేక రూపాల్లో, రంగుల్లో చెలామణిలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు తరువాత కొత్తగా నీలిరంగులో నోట్లు విడుదల అయ్యాయి. అయితే, ఇవి మునుపటి నోట్ల కంటే చాలా చిన్న సైజులో ఉన్నాయి. ఇక, గతంలో కీలక సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రసిద్ధ నిర్మాణాలు, ప్రాజెక్టులు, ప్రముఖ వ్యక్తుల పేరిట కరెన్సీ నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. అలాంటి వాటిలో హిరాకుడ్ ప్రాజెక్టు బొమ్మ కలిగిన 100 రూపాయల నోటును ప్రముఖంగా చెప్పుకోవాలి. ఒడిశాలో మహానదిపై 55 కిలోమీటర్ల పొడవైన ఆనకట్టే ఈ హిరాకుడ్ ప్రాజక్టు. ఈ ప్రాజెక్టు జ్ఞాపకార్థం 100 రూపాయల నోట్లను జారీ చేసింది ఆర్బీఐ. చాలా తక్కువ సంఖ్యలో వీటిని విడుదల చేయగా.. కొద్దిమంది వద్దే ఈ నోట్లు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ నోటుకు డిమాండ్ వచ్చింది.

హిరాకుడ్ డ్యామ్‌ ఫోటో కలిగిన 100 రూపాయల నోటును ఆన్‌లైన్‌‌లో వేలం వేయగా.. భారీ డిమాండ్ వచ్చింది. ఇండియన్ కాయిన్ మిల్ వెబ్‌సైట్‌లో ఈ నోటును విక్రయానికి పెట్టగా.. రూ. 2 లక్షలు పలికింది. వాస్తవానికి ఆర్బీఐ కొత్త నోటు జారీ చేసినప్పుడల్లా ముందుగా దానికి సంబంధించిన నిర్ధిష్ట కాపీని విడుదల చేస్తుంది. దీనినే నమూనా కాపీ అంటారు. వీటిని ఎగ్జిబిషన్ ప్రయోజనాల కోసం మాత్రమే జారీ చేస్తారు. అయితే, తాజాగా హిరాకుడ్ డ్యామ్ చిత్రం కలిగిన రూ. 100 నమూనా నోటును క్లాసికల్ న్యూమిస్మాటిక్ గ్యాలరీ రూ. 2 లక్షల ధరతో వేలం వేసింది.

ఇండియన్‌కాయిన్‌మిల్ ప్రకారం.. ఈ నోట్లను నలుగురు ఆర్‌బిఐ గవర్నర్ల (ఎస్ జగన్నాథన్, కెఆర్ పురి, ఎం నరసింహం, ఐజి పటేల్) సమయంలో జారీ చేశారు. ఒకవేళ మీ వద్ద ఇలాంటి పాత నోట్లు ఉన్నట్లయితే.. సంబంధిత వెబ్‌సైట్లలో విక్రయానికి పెట్టవచ్చు. మీ పేరిట అకౌంట్‌ క్రియేట్ చేసి.. సదరు నోటు ఫోటోను, మీ వివరాలను, విక్రయ ధరను నిర్ణయించి అందులో అప్‌లోడ్ చేయాలి. ఆ నోట్‌ను కోనుగోలు చేయాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇలా మీ వద్దనున్న పురాతన నోట్లను విక్రయించి.. లక్షలు సంపాదించవచ్చు.

Also read:

Village Boycott: నిజామాబాద్ జిల్లాలో మరో అరాచకం.. కొనసాగుతున్న వీడీసీల ఆగడాలు.. జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్న బాధితులు

Bigg Boss Telugu 5: హమ్మయ్యా.. షణ్ముఖ్ ఫామ్‌‌లోకి వచ్చేశాడు… శ్వేతా భుజంపై చేయివేసి..

AP Weather Report: రాగల 3 రోజులలో ఏపీలో మోస్తరు వర్షాలు.. ఈ 2 జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు