Pluto Video Viral: ప్లూటోగ్రహంపై వెండి కొండలా మంచు పర్వతాలు.. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్..

Pluto Video Viral: దీనిలో ప్లూటోపై అందమైన మంచు పర్వతాలు కనిపిస్తూ.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ వీడియో చూస్తే ఎవరికైనా వేరే గ్రహానికి వెళ్లినట్లు అనిపిస్తుంది.

Pluto Video Viral: ప్లూటోగ్రహంపై వెండి కొండలా మంచు పర్వతాలు.. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్..
Pluto Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2022 | 7:43 PM

Pluto Video Viral: కొన్ని సంవత్సరాల క్రితం వరకూ సౌరకుటుంబంలోని నవగ్రహాల్లో ఒకటి ప్లూటో అని చదువుకున్నారు. 1930 లో ప్లూటోను కనుగొన్నపుడు.. దీనిని సౌరకుటుంబం లోని తొమ్మిదవ గ్రహంగా పరిగణించారు. అయితే నేడు దీనిని మరగుజ్జు గ్రహం అని పిలుస్తున్నారు. అయితే సుమారు 76 సంవత్సరాల తర్వాత అంటే 2006 తర్వాత ప్లూటో నవగ్రహాల నుంచి తొలగించబడింది. అయితే అంతరిక్షంలో అనేక వింతలున్నాయి. వీటి గురించి ప్రజలకు తెలిసినప్పుడు  ఆశ్చర్యపడతారు. అంతరిక్షం, అన్ని గ్రహాలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అటువంటి వీడియో తాజాగా వైరల్ అవుతోంది. దీనిలో ప్లూటోపై అందమైన మంచు పర్వతాలు కనిపిస్తూ.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ వీడియో చూస్తే ఎవరికైనా వేరే గ్రహానికి వెళ్లినట్లు అనిపిస్తుంది.

వీడియోలో మీరు పర్వతాల వంటి దృశ్యాలను చూడవచ్చు. అక్కడ ఉన్న మొత్తం ప్రాంతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నిజానికి మంచు పేరుకుపోవడంతో ఆ ప్రాంతం అలా ప్రకాశవంతంగా కనిపిస్తోంది. ఈ షాకింగ్ వీడియో @CosmicGaiaX అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇవి ప్లూటో గ్రహంపైన మంచు పర్వతాలు అని తెలుస్తోంది. ఈ వీడియో షేర్ చేసిన కేవలం కొన్ని సెకన్లలోనే 2 మిలియన్ల వ్యూస్ అంటే 20 లక్షల వేక్షణాలను సొంతం చేసుకుంది. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

ప్లూటోను ‘యమ గ్రహం అని కూడా అని కూడా పిలుస్తారు. ఇక్కడ ‘యమ ధర్మ రాజు ఇల్లు ఉంటుందని నమ్మకం. అయితే  ఆ గ్రహంపై ఉన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా మానవులు జీవించడం అసాధ్యం అని శాస్త్రజ్ఞులు చెప్పారు. అయితే ప్లూటోపై నీరు మంచు రూపంలో ఉంటుందని, భూమిపై ఉన్న నీటి కంటే ఈ నీరు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ప్లూటో ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా మైనస్ 233 నుంచి మైనస్‌గా ఉంటుంది. ఇది 223 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతలో.. మానవులు క్షణంలో గడ్డకడతారు. కనుక ప్లూటో గ్రాహం మానవ అవస యోగ్యం కాదని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..