Viral: చేపలు పట్టేందుకు నది వద్దకు వెళ్లిన వ్యక్తి.. వినిపించిన భీకర అరుపులు.. ఏంటా అని చూడగా!
ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లాడు. ఒక పక్కన కూర్చుని గాలానికి ఎరను కట్టి నీళ్లల్లోకి విసిరాడు..
ఓ వ్యక్తి చేపలు పట్టేందుకు స్థానికంగా ఉన్న నది వద్దకు వెళ్లాడు. ఒక పక్కన కూర్చుని గాలానికి ఎరను కట్టి నీళ్లల్లోకి విసిరాడు. ఎంచక్కా సేద తీరుతూ చేపలు పడుతున్నాడు. అయితే ఇంతలో అతడికి ఎక్కడ నుంచో భీకర అరుపులు వినిపించాయి. సీన్ కట్ చేస్తే.. మరోవైపు నుంచి ముఖం నిండా రక్తంతో నీళ్లలో నుంచి బయటికి వస్తూ కనిపించాడు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. నది దగ్గర చేపలు పడుతోన్న ఓ వ్యక్తికి బిగ్గరగా అరుపులు వినిపించాయి. ఏంటా అని నలువైపులా చూడగా.. ముఖం నిండా రక్తంతో ఓ స్విమ్మర్ నీళ్లలో నుంచి బయటికి రావడం చూశాడు. ఒడ్డుకు చేరుకోగానే అతడి ముఖానికి తగిలిన గాయానికి ఆ వ్యక్తి టవల్ కట్టాడు. ”ముందుగా అతడు ఏదైనా రాయికి కొట్టుకుని ఉండవచ్చు లేదా ముఖానికి ఏదైనా తగిలి ఉండొచ్చునని అనుకున్నా.. కానీ ఆ గాయాన్ని తీక్షణంగా చూడగా.. అతడ్ని మొసలి గట్టిగా కరిచిందని అర్ధమైంది. వెంటనే నా దగ్గర ఉన్న మెడికల్ కిట్ ద్వారా ఫస్ట్ ఎయిడ్ చేశాను. ఆ రక్తస్రావాన్ని కాస్తయిన ఆపగలిగాను. అనంతరం అతడ్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామని” చూసిన వ్యక్తి మీడియాకు తెలిపాడు. కాగా, ఫ్లోరిడాలో సుమారు 1.3 మిలియన్ల మొసళ్లు, 21 మిలియన్ల ప్రజలు ఉన్నారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడే మొసళ్లు ఎటాక్ చేస్తాయని అక్కడున్న వారు చెబుతున్నారు.