Viral: వలలో పెద్ద చేపే పడిందని తెగ ఆనందపడ్డారు.. తీరా దాని నోరు తెరిచి చూస్తే.!

సరదాగా భార్యాభర్తలిద్దరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారి వలకు ఓ పెద్ద చేప చిక్కింది. దాన్ని చూసి తెగ ఆనందపడ్డారు. తీరా నోరు తెరిచి చూడగా..

Viral: వలలో పెద్ద చేపే పడిందని తెగ ఆనందపడ్డారు.. తీరా దాని నోరు తెరిచి చూస్తే.!
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2023 | 12:48 PM

సరదాగా భార్యాభర్తలిద్దరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారి వలకు ఓ పెద్ద చేప చిక్కింది. దాన్ని చూసి తెగ ఆనందపడ్డారు. తీరా నోరు తెరిచి చూడగా దెబ్బకు ఇద్దరూ విస్తుపోయారు. అసలు ఇంతకీ ఏం జరిగింది.? ఆ చేప ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని వర్జీనియాలో నివాసముంటున్న 36 ఏళ్ల టాడ్ ఎల్దర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి సరదాగా సముద్రంలో వేటకు వెళ్లారు. వారి వలకు ఓ భారీ చేప చిక్కింది. అది చూడటానికి వింతగా అనిపించింది. గొర్రె తలతో పోలి ఉన్న దాని తలను చూసి ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. తీరా దాని నోరు తెరిచి చూడగా.. ఆ చేప నోట్లో అచ్చం మనుషులకు ఉన్నట్లు దంతాలున్నాయి. దీంతో భార్యాభర్తలిద్దరూ దెబ్బకు విస్తుపోయారు.

ఆ చేపను భార్యభర్తలు ఫిషింగ్ అసోసియేషన్‌కు తీసుకెళ్లగా.. అక్కడివారు ఆ చేపను షీప్ హెడ్ ఫిష్ అని పిలుస్తారని చెప్పారట. దాని తల గొర్రెను పోలి ఉంటుందని.. మనుషుల మాదిరిగా దంతాలు ఉంటాయని చెప్పారు. ఆ చేప 8.6కిలోల బరువు తూగింది. అలాగే దాని వయసు 15సంవత్సరాలని.. దీంతో రికార్డు సృష్టించిందని ఫిషింగ్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.

Viral 1