AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది..? 99శాతం మందికి తెలియని అవాక్కయ్యే నిజాలు..

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ లేని జీవితాన్ని మనం ఊహించలేం. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ, కిచెన్ వస్తువులు.. ఇలా అన్నీ ప్లాస్టిక్‌తోనే ముడిపడి ఉన్నాయి. అయితే మనం నిత్యం వాడే ఈ గట్టి ప్లాస్టిక్ అసలు ఎలా తయారవుతుంది? ఇది ప్రకృతి నుంచి వస్తుందా లేక ఫ్యాక్టరీల్లో పుడుతుందా? అనే ఆసక్తికరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది..? 99శాతం మందికి తెలియని అవాక్కయ్యే నిజాలు..
How Is Plastic MadeImage Credit source: AI Image
Krishna S
|

Updated on: Aug 28, 2026 | 12:26 PM

Share

ఉదయం బ్రష్ చేసుకోవడం నుంచి రాత్రి పడుకునే ముందు వాడే స్మార్ట్‌ఫోన్ వరకు.. ప్రతిచోటా ప్లాస్టిక్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. కుర్చీలు, బల్లలు, టీవీలు, ఫ్రిజ్‌లు, స్విచ్‌లు, ఛార్జర్లు.. ఇలా నిత్యం చేతుల్లో పట్టుకునే ఈ గట్టి ప్లాస్టిక్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ప్రకృతి సిద్ధమైనదా లేక రసాయన సమ్మేళనమా? ఎలక్ట్రానిక్స్ రంగంలో దీని ప్రాధాన్యత ఏమిటి? డౌట్లు చాలా మందికి ఉంటాయి. అందరూ అనుకుంటున్నట్లు ప్లాస్టిక్ చెట్ల నుంచో లేదా ప్రకృతి నుంచో నేరుగా లభించదు. ఇది ముడి చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల ద్వారా తయారవుతుంది. రిఫైనరీలలో ముడి చమురును శుద్ధి చేసినప్పుడు నాఫ్తా వంటి రసాయనాలు వెలువడతాయి. వీటి నుంచి ఇథిలీన్, ప్రొపిలీన్ వంటి సమ్మేళనాలను వేరుచేసి.. పాలిమరైజేషన్ అనే రసాయన ప్రక్రియ ద్వారా పొడవైన గొలుసుల వంటి అణువులతో పాలిమర్లను తయారు చేస్తారు. వీటికి వివిధ రసాయనాలను జోడించి పాలిథిలిన్, పాలిప్రొపిలిన్, పీవీసీ, ఏబీఎస్, పాలికార్బోనేట్ వంటి విభిన్న రకాల ప్లాస్టిక్‌లను ఉత్పత్తి చేస్తారు.

ఎలక్ట్రానిక్స్ – గృహోపకరణాల్లో ఎందుకంత కీలకం?

ఫర్నిచర్ తయారీలో దృఢంగా, తేలికగా ఉండే పాలిప్రొపిలిన్ లేదా హెచ్‌డీపీఈ వాడితే.. టీవీలు, స్మార్ట్‌ఫోన్ల బాడీ కేసింగ్‌ల కోసం అధిక ఉష్ణ నిరోధకత, పటిష్టత కలిగిన ఏబీఎస్, పాలికార్బోనేట్ వంటి ఇంజనీరింగ్ ప్లాస్టిక్‌లను ఉపయోగిస్తారు. వీటికి గల ముఖ్యమైన లక్షణాలు..

విద్యుత్ నిరోధకత: లోహాల వలె ప్లాస్టిక్ విద్యుత్‌ను ప్రసరింపజేయదు. అందుకే వైర్లు, ప్లగ్‌లు, స్విచ్‌లు, ఛార్జర్లలో షాక్ కొట్టకుండా రక్షణగా దీన్ని వాడతారు.

తక్కువ బరువు – మన్నిక: లోహాలతో పోలిస్తే తేలికగా ఉండి, తుప్పు పట్టని గుణం కలిగి ఉంటుంది.

సులభమైన తయారీ: ఏ ఆకారంలోకైనా సులభంగా మలచవచ్చు, ఉత్పత్తి ఖర్చు కూడా చాలా తక్కువ.

పర్యావరణ సవాల్ – బాధ్యతాయుత వినియోగం

ప్లాస్టిక్ చెట్ల నుండి వస్తుందనేది అపోహ మాత్రమే. రబ్బరు చెట్ల నుంచి వచ్చే లేటెక్స్ వేరు, ప్లాస్టిక్ వేరు. ప్రస్తుతం మొక్కజొన్న, చెరకు వంటి వాటితో బయోప్లాస్టిక్స్ తయారు చేస్తున్నప్పటికీ పారిశ్రామికంగా పెట్రోలియం ఆధారిత ప్లాస్టిక్‌లదే పైచేయి. అయితే ప్లాస్టిక్ సహజంగా త్వరగా మట్టిలో కలిసిపోదు. ఈ వ్యర్థాలు నదులు, సముద్రాల్లోకి చేరి జలచరాల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. అందువల్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తగ్గించడం, వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం, ఆహారాన్ని వేడిచేసేటప్పుడు సురక్షితమైన గ్రేడ్ ప్లాస్టిక్ వాడటం మనందరి బాధ్యత.

Follow Us
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
గణేశుడిని విందుకు పిలిచిన కుబేరుడు.. ఆ తర్వాత జరిగినది ఊహించలేరు!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
మీరు Flipkartలో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకో భారీ గుడ్‌న్యూస్
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
సౌందర్య ఇంటి ఎంట్రన్స్ లో అది చూడగానే తట్టుకోలేకపోయా..
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
గణేష్ మండపాల నిర్వాహకులకు గుడ్ న్యూస్.. డీజేలపై ఏపీ సర్కార్ కీలక
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు