AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.1.15 లక్షల వరకు

రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిరుద్యోగులకు మరో భారీ నోటిఫికేషన్‌ అందించింది. ఈ నోటిఫికేషన్‌ కింద సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.1.15 లక్షల వరకు
APPSC Hostel Welfare Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 18, 2026 | 9:27 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిరుద్యోగులకు మరో భారీ నోటిఫికేషన్‌ అందించింది. ఈ నోటిఫికేషన్‌ కింద సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీసుల్లో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్‌ 9, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పోస్టులను మూడు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అవేంటంటే..

పోస్టుల వివరాలు..

  • సోషల్‌ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టుల సంఖ్య: 21
  • ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టుల సంఖ్య: 23
  • బీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ పోస్టుల సంఖ్య: 29

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు అక్టోబర్ 29, 2026వ తేదీ వరకు చేసుకోవచ్చు. అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న పూర్తి విద్యార్హతలను పరిశీలించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల ఎంపిక సింగిల్‌ లెవల్‌ ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మొత్తం 150 మార్కులు ఉంటాయి. హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-II పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రజినీ సినిమాలో చిరు విలన్.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా ఇదే..
రజినీ సినిమాలో చిరు విలన్.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా ఇదే..
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
తెలుగురాష్ట్రాలను వీడుతున్న రుతపవనాలు.. ఈ రోజు వాతావరణం
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయణ'లో అరుణ్ గోవిల్
అప్పుడు రాముడిగా.. ఇప్పుడు దశరథుడిగా.. 'రామాయణ'లో అరుణ్ గోవిల్
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
కందిపప్పు vs పెసరపప్పు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
సింహరాశిలో కేతు-మంగళ యోగం.. వీరికి ఊహించని మార్పులు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ప్రముఖ యూట్యూబర్‌ మధుమిత పరార్‌.. భారీగా పెరిగిన ఫాలోవర్లు!
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
ఐదో వారం ఓటింగ్‌లో దుమ్మురేపుతున్న ఆ ముగ్గురు..
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
'పుష్ప' ముద్దు సీన్‌ను రీక్రియేట్ చేసిన స్వీడన్ దంపతులు.. వీడియో
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు
NEET PG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌.. అక్టోబర్ 12 నుంచి దరఖాస్తులు