AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Update: రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే!

పీఎం కిసాన్ 24వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. రాబోయే విడతలో పీఎం కిసాన్ డబ్బులు రూ.2వేలు పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రీలో కచ్చితంగా వివరాలను నమోదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. ఇది పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు పడతాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ స్పష్టం చేశారు.

PM Kisan Update: రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే!
Pm Kisan 24th Installment Update
Anand T
|

Updated on: Sep 18, 2026 | 9:46 AM

Share

దేశంలోని రైతన్నలకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.6వేలను విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 23 విడతలు విజయవంతంగా విడుదల చేసిన కేంద్ర సర్కార్ తాజాగా 24 విడత డబ్బులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలో 24 విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు అధికారులు కొన్ని సూచనలు జారీ చేశారు.

పీఎం కిసాస్ కింద అందే పెట్టుబడి సాయం 24 విడత డబ్బులు పొందాలంటే ఫార్మర్‌ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్యను కచ్చితంగా పొందాలని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం 64,71,800 మంది రైతులు పీఎం కిసాన్ పొదుతున్నారని.. అయితే వీరిలో 52,06,777 మంది రైతులు మాత్రమే ఫార్మర్‌ రిజిస్ర్టీలో రిజిస్టర్ అయ్యారని తెలిపారు. మిగతా 7,34,215 మంది రైతులు సైతం వెంటనే ఫార్మర్‌ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. పీఎం కిసాన్‌ తొలి విడత కింద డబ్బులు పొంది.. ఫార్మిర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేయకపోయినా.. వారిని అనర్హులుగానే ప్రకటించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

  • రైతు ఆధార్ కార్డు (మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి)
  • పట్టాదారు పాస్‌బుక్, భూమి రెవెన్యూ రికార్డు వివరాలు
  • ఆధార్ సీడింగ్ పూర్తయిన బ్యాంక్ ఖాతా వివరాలు

ఫార్మర్‌ రిజిస్ట్రీ ద్వారా విశిష్ట సంఖ్యను ఎలా పొందాలి?

స్టెప్-1: ఈ రిజిస్ట్రీ విశిష్ట నెంబర్ పొందేందుకు ముందుగా మీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఫార్మర్ రిజిస్ట్రీ అధికారిక పోర్టల్ లేదా కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన ఫార్మర్ రిజిస్ట్రీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్-2: తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, వచ్చిన OTPని సబ్‌మిట్ చేసిన మీ డీయిటేల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోండి.

స్టెప్-3: ఇప్పుడు అక్కడ మీ జిల్లా, మండలం, గ్రామం ఎంచుకుని, మీ పాస్‌బుక్, సర్వే నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ డీయిటేల్స్ కరెక్ట్‌గా ఉంటే మీ భూమికి సంబంధించిన వివరాలు అక్కడ కనిపిస్తాయి.

స్టెప్-4: ఇప్పుడు మీ పేరు, చిరునామా, భూమి విస్తీర్ణం సరిచూసుకుని దరఖాస్తును సబ్మిట్ చేయండి. ప్రక్రియ విజయవంతం కాగానే మీ మొబైల్‌కు 11 అంకెల Farmer ID జారీ అవుతుంది. అంతే మీ పార్మర్ రిజిస్ట్రీ పూర్తయినట్టే.. ఈ నెంబర్ ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు పడుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
భారీగా పెరిగిన ఉల్లిపాయల ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించండి.. మొండి పట్టుదల గల వ్యక్తుల కథలు
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
ఒకే హాస్పిటల్ బిల్లుపై 2 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎలా వాడాలి?
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
డిగ్రీ అర్హతతో APPSCలో 73 ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.15లక్షలు
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
అప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు టిఫిన్ సెంటర్ నడుపుతూ..
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
ఒకేసారి 5 జట్లు, 69 మంది ఆటగాళ్లు.. బీసీసీఐ సంచలన మాస్టర్ ప్లాన్
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?
పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?
రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..
రామ్ పోతినేని సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..
గణేష్ నిమజ్జనాలు.. హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక..