AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకు భారీ గుడ్‌న్యూస్‌..!

Flipkart:ఈ రోజుల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ట్రెండ్ భారీగా పెరిగిపోయింది. షాపింగ్‌లకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేస్తున్నారు. అయితే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? అయితే మీకో భారీ గుడ్‌న్యూస్‌. ఉంది. అదేంటో మీరు తెలిస్తే ఎగిరి గంతులేస్తారు..

Flipkart: మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తారా? మీకు భారీ గుడ్‌న్యూస్‌..!
Flipkart
Subhash Goud
|

Updated on: Sep 18, 2026 | 10:11 AM

Share

Flipkart: మీరు ఎక్కువగా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్‌ చేస్తారా? అయితే మీకో భారీ గుడ్‌న్యూస్‌ ఉంది. భారీగా తగ్గింపుతో షాపింగ్‌ చేసే అవకాశం వచ్చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద పండుగ సేల్ అయిన బిగ్ బిలియన్ డేస్ 2026 తేదీలను ప్రకటించింది. కంపెనీ ప్రత్యేక మైక్రోసైట్ ప్రకారం, ఈ సేల్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మరియు ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఒక రోజు ముందుగా, అంటే అక్టోబర్ 8 నుంచే ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేల్‌లో బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు అనేక ప్రత్యేక డీల్స్, ఆఫర్లు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులపై 10% వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు కొన్ని వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ అచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Driving License: వాహనదారులకు హెచ్చరిక.. సెప్టెంబర్ 25లోగా ఈ పనిచేయకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు!

అమ్మకాలు అక్టోబర్ 9 నుంచి ప్రారంభం:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026 అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. ఈ సేల్ కోసం ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ల వివరాలతో కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా ప్రారంభించింది. లిప్‌కార్ట్ ప్లస్, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ సభ్యులు అక్టోబర్ 8 నుండి ముందస్తు యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులతో చేసే చెల్లింపులపై 10% వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు కూడా 10% ఆదాను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

క్యాష్‌బ్యాక్, అనేక ప్రత్యేక ఆఫర్లు:

ఈ సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ సూపర్ మనీ మొదటి లావాదేవీపై 10% క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. కస్టమర్లు యూపీఐ, ఇతర పేమెంట్ గేట్‌వేల ద్వారా కూడా చెల్లింపులు చేయగలరు. ఈ సేల్‌లో ప్రైస్ క్రాష్, BBD స్పెషల్స్, టిక్‌టాక్ డీల్స్, బ్రాండ్ అవర్స్, డబుల్ డిస్కౌంట్స్, రష్ అవర్స్ వంటి వివిధ ఈవెంట్‌లు ఉంటాయి. అయితే, ఈ డీల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. సేల్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

మీరు ఈ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందవచ్చు:

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2026, వివిధ కేటగిరీలలోని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై తక్కువ ధరల డీల్స్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. వీటిలో స్మార్ట్‌ఫోన్‌లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లు, ట్రూ వైర్‌లెస్ స్టీరియోలు (TWS), వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ హోమ్ అప్లయెన్సెస్, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల ధరలను గానీ, నిర్దిష్ట డీల్స్‌ను గానీ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ సేల్ అమెజాన్ రాబోయే సేల్‌తో పోటీ పడనుంది.

ఇది కూడా చదవండి: Edible Oil: పండుగ సీజన్‌కు ముందు పెద్ద ఊరట! వంట నూనె ధరలు తగ్గనున్నాయా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us