Viral: వాయమ్మో! వీడండీ.. అసలైన జాతిరత్నమంటే.. మొబైల్ నెంబర్ రాయమంటే.. ఏకంగా రచ్చలేపిండు..
బ్యాక్ బెంచర్.. ఎక్కడైనా కూడా బ్యాక్ బెంచరే.. ఇలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌లో వచ్చే రాని ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్..
బ్యాక్ బెంచర్.. ఎక్కడైనా కూడా బ్యాక్ బెంచరే.. ఇలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్‌లో వచ్చే రాని ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ ఇవ్వడమే కాదు.. వీలు చిక్కినప్పుడల్లా.. ప్రతీ విషయాన్ని తమ స్టైల్‌లో డీల్ చేస్తుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ యూనివర్సిటీ ఫారమ్‌ను పూర్తి చేసిన తీరు నెటిజన్లను భలేగా ఆకట్టుకుంది. అతడ్ని మొబైల్ నెంబర్ గురించి రాయమంటే.. తన మొబైల్ ఏ కంపెనీది.? దాని సిరీస్ ఏంటి.? అనేది వివరంగా రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వీడండీ అసలైన జాతిరత్నం’, ‘ఫారమ్ కంటే స్మార్ట్ పర్సన్’ అంటూ ఇంటర్నెట్‌లో పంచ్‌లు పేలుస్తున్నారు. ‘వీడు పక్కా బ్యాక్ బెంచర్’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.. ‘ఈ స్టూడెంట్ ఔట్ ఆఫ్ బాక్స్’ అలోచించాడని మరొకరు రాసుకొచ్చారు. లేట్ ఎందుకు మీరూ చూసేయండి..