Inspirational Story: ప్రతిభకు మార్కులు కొలమానం కాదు.. టెన్త్‌లో థర్డ్ క్లాస్‌లో పాస్.. మార్క్ షీట్ షేర్ చేసిన IAS ఆఫీసర్

10-12వ తరగతిలో పేలవంగా రాణించిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో పెద్ద ఆఫీసర్లుగా మారిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. మార్కులు చూసి వ్యక్తి సామర్థ్యాన్ని కొలవలేమని కామెంట్ తో ఈ మార్కుల షీట్ ను జత చేశారు అవనీష్.

Inspirational Story: ప్రతిభకు మార్కులు కొలమానం కాదు.. టెన్త్‌లో థర్డ్ క్లాస్‌లో పాస్.. మార్క్ షీట్ షేర్ చేసిన IAS ఆఫీసర్
Ias Awanish Sharan
Follow us

|

Updated on: Jul 07, 2022 | 6:06 PM

Inspirational Story: పరీక్షలల్లో మార్కులకు, ప్రతిభకు సంబంధం లేదని చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు.. అందుకు అనుగుణంగానే.. ఫస్ట్ క్లాస్ లో అత్యధిక మార్కుల్లో పాస్ అయిన విద్యార్థులకే కాదు.. సాధారణంగా ఉత్తీర్ణత సాధించిన వారు కూడా పలు కంపెనీల్లో ఉద్యోగావకాశాలను దక్కించుకుంటారు. దీనికి కారణం.. వారిలోని కృషి, పట్టుదలే.. అయినప్పటికీ నేటి చదువులు విద్యార్థుల ప్రతిభకు కొలమానం మార్కులే అనుకునేవారు చాలామంది ఉన్నారు. దీంతో బోర్డు ఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వస్తే చాలు.. స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశ చెందుతారు. ఇక తమకు భవిష్యత్ లేదని.. కెరీర్ తలుపులు మూసుకుపోతాయేమోనని ఆందోళన చెందుతారు. చాలా మంది విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయని బాధపడుతూ తీవ్ర నిరాశతో.. దారుణమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అయితే అటువంటి స్టూడెంట్స్ కు స్ఫూర్తివంతమైన ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు గురించి తెలియయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 10-12వ తరగతిలో పేలవంగా రాణించిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో పెద్ద ఆఫీసర్లుగా మారిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ కేడర్‌..  2009 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అవనీష్ శరణ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. విద్యార్థులను ఉత్సాహపరిచే లక్ష్యంతో.. అవనీష్ తన పదవ మార్కుషీట్ (10వ మార్కుషీట్)ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.మొదట ఈ మర్క్స్ షీట్ చూసిన వారు ఆశ్చర్యపోయారు, ఆపై – మీరే మాకు స్ఫూర్తి . నిజానికి, అవనీష్ శరణ్ థర్డ్ డివిజన్ లో పదవ తరగతి ఉత్తీర్ణత అయ్యారు. నేడు.. నేడు ఆయన ఐఏఎస్‌ ఆఫీసర్ గా ఉన్నతి పదవి చేపట్టి.. తన సేవలను అందిస్తున్నారు.

IAS అధికారి అవనీష్ శరణ్ తన 10వ తరగతి మార్క్‌షీట్‌ను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దాని ప్రకారం అవనీష్ 1996లో బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 700 మార్కులకు 314 మార్కులు మాత్రమే వచ్చాయి. అంటే 44.5% మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. గణితంలో 30 మార్కులకు పాస్ కాగా..  అవనీష్ కు  31 మార్కులు వచ్చాయి. అవనీష్ శరణ్ దీంతో మార్కుల అధికంగా రానప్పటికీ UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మార్కులు చూసి వ్యక్తి సామర్థ్యాన్ని కొలవలేమని కామెంట్ తో ఈ మార్కుల షీట్ ను జత చేశారు అవనీష్.

ఇవి కూడా చదవండి

IAS అవనీష్ శరణ్ జీవితం పోరాటాలతో నిండి ఉంది. ఆయన ఇంట్లో కరెంటు సౌకర్యం లేదని, లాంతరు వెలుగులో తాను ఎలా చదువుకునేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా కేవటా గ్రామ నివాసి. తండ్రి , తాత ఇద్దరూ ఉపాధ్యాయులు. ఐఏఎస్ శరణ్ నినాదం, ‘మనకు ఉన్నది ఒకటే జీవితం.. వీలైనంత వరకు మంచి పనులు చేస్తూనే ఉండాలి’.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..