Viral Photos: హెల్మెట్ కాపాడింది.. లేకుంటే ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కింద పడి, ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..!
బైక్ రైడింగ్‌లో కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెప్పినా కొంతమంతి మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. దాంతో ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌తో ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్నారో మనం ఎన్నో వీడియోల్లో చూశాం.

Wear Helmet: బైక్ రైడింగ్‌లో కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెప్పినా కొంతమంతి మాత్రం పెడచెవిన పెడుతూనే ఉన్నారు. దాంతో ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్‌తో ఎంతోమంది ప్రాణాలు కాపాడుకున్నారో మనం ఎన్నో వీడియోల్లో చూశాం. తాజాగా టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్.. బైక్ ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. హెల్మెట్ ఉండడం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఇప్పుడు మన చూడబోయే ఫొటోస్‌లో కూడా కేవలం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది. ఈ దిగ్భ్రాంతికరమైన బైక్ యాక్సిడెంట్ గుజరాత్‌లోని దహోద్ నగరంలో జరిగింది.
ఇక్కడ బైక్ రైడర్ గుంతను తప్పించడానికి ప్రయత్నిస్తుండగా రోడ్డుపై పడిపోయాడు. బైక్ పై ఓ మహిళతో పాటు చిన్నారి కూడా ఉన్నారు. అదే సమయంలో ట్రాక్టర్ ట్రాలీ అటు నుంచి వెళుతోంది. బైక్ పడగానే, ఆ యువకుడు ట్రాలీ కిందకు పడిపోయాడు. ట్రాలీ చక్రం అతని తలపై నుంచి ముందుకు వెళ్లింది. కానీ, అతను హెల్మెట్ ధరించినందున పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఎంత ఘోరం జరిగుండేదో ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
ఈ ప్రమాదం హైవే సిగ్నల్‌పై అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయింది. బైక్‌పై వెళ్తున్న జంటతో పాటు వారి కుమారుడు కూడా ఉన్నాడు. బిడ్డ తల్లి ఒడిలో ఉంది. బైక్ నుంచి కింద పడిన తర్వాత, ఆ మహిళ తన కొడుకుతో కలిసి రోడ్డుకు మరోవైపు పడిపోయింది. దీంతో వారిద్దరూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ యువకుడికి కొన్ని గాయాలు అయ్యాయి. కానీ, అతను మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు.
ట్రాక్టర్ డ్రైవర్‌పై మహిళ ఆగ్రహం.. ఈ సంఘటన తరువాత ట్రాక్టర్ డ్రైవర్‌పై మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ప్రమాదం విషయంలో ట్రాక్టర్ డ్రైవర్ తప్పు లేనే లేదు. గుంతను తప్పించే ప్రయత్నంలో, బైక్ కిందపడిపోయింది. భారీ వర్షాల కారణంగా గుంతలు నీటితో నిండిపోయాయి. బైక్ గుంతలోకి వెళ్లకుండా అదుపు తప్పినట్లు మనం వీడియోలో చూడవచ్చు. అయితే, హెల్మెట్ లేకపోతే ఎంత ఘోర ప్రమాదం జరిగేనో అంటూ ఈఫొటోలను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
Also Read: Viral Video: అదృష్టం అంటే ఇదే మరీ.! తృటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు.. వైరల్ వీడియో.!