AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: తాళి కట్టించుకున్న వ‌రుడు.. ట్రోలింగ్‌ చేస్తోన్న నెటిజన్లు.. పట్టించుకోని జంట.!

Groom Wears Mangalsutra: ముంబైకి చెందిన ఓ ప్రేమ జంట వివాహం వార్తల్లో నిలిచింది. వ‌రుడు వ‌ధువు మెడ‌లో తాళి....

Viral News: తాళి కట్టించుకున్న వ‌రుడు.. ట్రోలింగ్‌ చేస్తోన్న నెటిజన్లు.. పట్టించుకోని జంట.!
Ravi Kiran
|

Updated on: May 06, 2021 | 7:50 PM

Share

Groom Wears Mangalsutra: ముంబైకి చెందిన ఓ ప్రేమ జంట వివాహం వార్తల్లో నిలిచింది. వ‌రుడు వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్ట‌కుండా.. అదే వ‌ధువు చేత త‌న మెడ‌లో మంగ‌ళ‌సూత్రం క‌ట్టించుకుని వార్త‌ల్లో నిలిచాడు. తాను హార్డ్‌కోర్ స్త్రీవాది అని స్త్రీ, పురుషులంద‌రూ స‌మాన‌మేన‌ని నమ్ముతున్నాడు. ఈ వివాహంపై సామాజిక మాధ్య‌మాల్లో భిన్న ర‌కాలుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన శార్దూల్ క‌దం, త‌నుజా ఒకే కాలేజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. కొంతకాలం తర్వాత ఇన్‌స్టా వేదికగా కలుసుకున్నారు. డేటింగ్ చేశారు. ఆ త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ్డారు. త‌నుజా త‌ల్లిదండ్రుల‌కు పెళ్లి చేసేందుకు డ‌బ్బు స‌మ‌స్య వ‌చ్చింది. పెళ్లి ఖ‌ర్చు స‌మానంగా పంచుకోవడానికి శార్దూల్ ముందుకొచ్చాడు. నాలుగు నెలల క్రితం తనూజ చేత మంగళసూత్రం కట్టించుకున్నాడు.

అయితే నెటిజ‌న్లు ఈ వివాహంపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు చీర కూడా కట్టండి అంటూ శార్దూల్‌ను ఉద్దేశించి విమ‌ర్శించారు. ప్ర‌తి నెల మీరు రుతుస్రావం అవుతున్నారా? అని వ్యంగంగా ప్ర‌శ్నించారు. కానీ ఆ ట్రోల్స్‌ను ఆ నూత‌న దంప‌తులు ప‌ట్టించుకోలేదు. తామిద్ద‌రం ఏంటో త‌మ‌కు తెలుసు. కాబ‌ట్టి ప్ర‌పంచం ఏం అనుకుంటే త‌మ‌కెందుకు అని శార్దూల్, త‌నుజా డోంట్ కేర్‌ అంటున్నారు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?