Viral: విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం.. కోట్లు ఇస్తామన్నా వదలని రైతు.. వెరీ ఇంట్రెస్టింగ్‌.!

 Japan Man Farming: సాధారణంగా విమానాశ్రయాలు కట్టడానికి, ప్రాజెక్టులు నిర్మించడానికి, రోడ్లు వేయడానికి ఎంతో మంది రైతుల పొలాలను...

Viral: విమానాశ్రయం మధ్యలో వ్యవసాయం.. కోట్లు ఇస్తామన్నా వదలని రైతు.. వెరీ ఇంట్రెస్టింగ్‌.!
Farmer
Follow us

|

Updated on: May 06, 2021 | 5:03 PM

 Japan Man Farming: సాధారణంగా విమానాశ్రయాలు కట్టడానికి, ప్రాజెక్టులు నిర్మించడానికి, రోడ్లు వేయడానికి ఎంతో మంది రైతుల పొలాలను ప్రభుత్వం భూసేకరణ పేరుతో తీసుకోవడం చూస్తుంటాం. కానీ జపాన్‌కు చెందిన ఒక రైతు నుంచి పొలాన్ని తీసుకోలేక అక్కడి ప్రభుత్వం ఏకంగా దాని చుట్టూ విమానాశ్రయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ఆనుకొని ఆ రైతు వ్యవసాయం చేస్తున్నాడు. టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే విమానాల రణగొణ ధ్వనుల మధ్య ఆ రైతు కూరగాయలు, పండ్లు పండిస్తున్నాడు. ఈ ఇంటరెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..

జపాన్‌లోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో నరిత అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. న్యూ టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అని కూడా దీన్ని పిలుస్తారు. 1960ల్లో ఈ విమానాశ్రయం నిర్మించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టోక్యో శివారులోని నరిత అనే గ్రామం సహా చుట్టు పక్కల గ్రామాల్లో విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ చేసింది. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడున్న స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఇప్పుడు విమానశ్రయం మధ్యలో వ్యవసాయం చేస్తున్న రైతు టకావో షిటో తండ్రి కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. చాలామంది రైతులు ప్రభుత్వం ఇచ్చిన డబ్బు తీసుకొని విమానాశ్రయానికి భూములు రాసిచ్చి నగరబాట పట్టారు.

కానీ, షిటో తండ్రి మాత్రం తనకు ఎన్ని కోట్లు ఇచ్చినా.. తన భూమిని ఇచ్చేది లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. అయినా సరే జపాన్ ప్రభుత్వం మొండిగా షిటో భూమిని వదిలి విమానాశ్రయం నిర్మించింది. ఆ తర్వాత షిటో తండ్రిపై కేసు పెట్టింది. కానీ కోర్టులో అది షిటో తండ్రికి అనుకూలంగా రావడంతో వారి కుటుంబం అక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో