5

మనసిచ్చిన అమ్మాయి భార్యగా జీవితంలో అడుగు పెడుతున్న వేళ.. వరుడు కంట్లో ఆనందభాష్పాలు.. వీడియో వైరల్

కన్నీరు నిండిన కళ్లతో నవ్వుతూ.. కనిపించాడు. కంట కన్నీరు ప్రవహిస్తుండగా.. ఆ కన్నీళ్లను తుడుచుకుంటున్నాడు. అదే సమయంలో.. అతని వద్దకు వధువు నవ్వుతూ చేరుకుంది. అతనిని కౌగిలించుకుంది. వధువు నవ్వుతూ.. వరుడి కన్నీళ్లను తుడిచింది.

మనసిచ్చిన అమ్మాయి భార్యగా జీవితంలో అడుగు పెడుతున్న వేళ.. వరుడు కంట్లో ఆనందభాష్పాలు.. వీడియో వైరల్
Groom Eyes Full Of Tears
Follow us

|

Updated on: Nov 25, 2022 | 12:23 PM

ప్రేమించడం సులభమే కానీ ప్రాణానికి ప్రాణంగా జీవించే వ్యక్తులు అదృష్టవంతులు. అటువంటి ప్రేమని ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే వ్యక్తులు ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. ప్రపంచంలో ప్రేమికులు అనేకమంది ఉన్నారు.. అయితే వారిలో కొందరు మాత్రమే నిజమైన ప్రేమికులు. తాము ఇష్టపడి.. ప్రేమించిన అమ్మాయి భార్యగా జీవితంలో అడుగు పెడితే..అతని జీవితం స్వర్గమయం. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఓ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే.. ముఖ్యంగా ఎవరినైనా, ఎప్పుడైనా ప్రేమించిన ప్రేమికులైతే.. కచ్చితంగా భావోద్వేగానికి గురవుతారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వరుడు .. పందిట్లో అడుగు పెడుతున్న వధువును చూసి ఏడుస్తూ కనిపించాడు. పెళ్లి దుస్తుల్లో అందమైన రాజకుమారిలా అడుగు పెడుతున్న తన ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వధువును చూసిన వరుడి కళ్లలో నీళ్లు ఎలా తిరుగుతున్నాయో వీడియోలో చూడొచ్చు. కన్నీరు నిండిన కళ్లతో నవ్వుతూ.. కనిపించాడు. కంట కన్నీరు ప్రవహిస్తుండగా.. ఆ కన్నీళ్లను తుడుచుకుంటున్నాడు. అదే సమయంలో.. అతని వద్దకు వధువు నవ్వుతూ చేరుకుంది. అతనిని కౌగిలించుకుంది. వధువు నవ్వుతూ.. వరుడి కన్నీళ్లను తుడిచింది. అయితే ఈ సమయంలో వధువు కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ దృశ్యం చాలా అందంగా ఉంది. ఇది చూసిన తర్వాత నిజమైన ప్రేమికులు అంటూ కామెంట్ చేస్తున్నారు. తమకు అటువంటి ప్రేమ దక్కలేదు కదా అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Gulzar_sahab పేరుతో ఒక IDతో షేర్ చేశారు. ఎప్పుడు తమ ప్రేమని పెళ్లి చేసుకుంటారో.. అప్పుడు ఆనందంతో ఇలా కన్నీరు వస్తాది. దీనిని ఎవరూ ఆపలేరు అనే క్యాప్షన్ తో షేర్ చేశారు. కేవలం 30 సెకన్ల ఈ వీడియోను ఇప్పటి వరకు 49 వేలకు పైగా వీక్షించగా, 2300 మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రేమ అదృష్టం వల్ల మాత్రమే దక్కుతుంది ‘ అని ఒకరు కామెంట్ చేస్తే.. అదృష్టం అంటే ఈ జంటదే అనిమరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..