బట్టలు లేకుండా ఫొటో తీసి.. రూ.11 లక్షలు ఇచ్చిన గూగుల్! అసలు ముచ్చట ఏంటంటే..?
గూగుల్ స్ట్రీట్ వ్యూ వాహనం, ఒక వ్యక్తిని అతని ఇంటి వెనుక బట్టలు లేకుండా ఉన్నప్పుడు చిత్రీకరించింది. ఈ గోప్యతా ఉల్లంఘన కారణంగా ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు గూగుల్ ను రూ. 11 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

గూగుల్ స్ట్రీట్ వ్యూ గురించి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోని ఏ వీధినైనా ఫోన్లోనే చూసేయొచ్చు. అంత టెక్నాలజీని మనకు అందించేందుకు గూగుల్ ముందుగానే వాటిని క్యాప్చర్ చేస్తుంది. కార్లకు పెద్ద కెమెరా పెట్టి.. వాటిని వీధుల వెంట తిప్పుతూ.. గూగుల్ స్ట్రీట్‌లో డేటాను పెడుతూ ఉంటుంది. అయితే అలాంటి ఓ కారు చేసిన తప్పుతో.. గూగుల్ కంపెనీ ఓ వ్యక్తికి ఏకంగా రూ.11 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే..? గూగుల్ స్ట్రీట్ వ్యూ కారు తన ఇంటి వెనుక నుంచి వెళ్తూ.. తాను బట్టలు లేకుండా ఉన్న సమయంలో తనను క్యాప్చర్ చేసిందని, అది చూసి తన ఇరుగుపొరుగు వారు నవ్వుకుంటున్నారని.. దాంతో తన పరువుకు భంగం కలిగిందని ఆ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దీంతో కోర్టు అతనికి 12,500 డాలర్లు చెల్లించాలని గూగుల్‌ను ఆదేశించింది.
ఈ ఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది. 2017లో అర్జెంటీనాలోని ఒక చిన్న పట్టణంలో 6 అడుగుల 6 ఎత్తు గల గోడ వెనుక ఉన్నప్పటికీ గూగుల్ తన గౌరవాన్ని దెబ్బతీసిందని ఆ వ్యక్తి కోర్టులో వాదించాడు. వృత్తిరీత్యా పోలీసు అధికారి అయిన ఆ వ్యక్తి, ఈ దాడి తనను పనిలో, తన పొరుగువారిలో ఎగతాళికి గురి చేసిందని పేర్కొన్నాడు. అతని ఫొటో ఇంటర్నెట్‌లో అందరికీ కనిపించేలా వ్యాపించినప్పటికీ, గూగుల్ అతని ఇంటి నంబర్, వీధి పేరును కూడా అస్పష్టం చేయలేదు. అవి చిత్రంలో స్పష్టంగా కనిపించాయి.
దీంతో అతను 2019లో గూగుల్ పై దావా వేశాడు. కానీ దిగువ కోర్టు మొదట ఆ కేసును కొట్టివేసింది, ఆ వ్యక్తి “అనుచిత స్థితిలో” బయట ఉన్నందుకు తప్పుపట్టింది. అయితే ఈ నెలలో అప్పీళ్ల ప్యానెల్ ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టింది. గూగుల్ తన వాదనలో, చుట్టుకొలత గోడ తగినంత ఎత్తులో లేదని పేర్కొంది. “ఇది బహిరంగ ప్రదేశంలో కాకుండా వారి ఇంటి పరిమితుల్లో, సగటు పరిమాణంలో ఉన్న వ్యక్తి కంటే ఎత్తైన కంచె వెనుక ఉన్న వ్యక్తి చిత్రాన్ని కలిగి ఉందని” అని కోర్టు గమనించింది. దీంతో దీన్ని వ్యక్తిగత గోపత్యను హరించడంగా భావించింది పై విధంగా తీర్పు ఇచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
