Viral Video: బంగారంతో చేసిన అదిరేటి డ్రెస్ ధరించిన యువతి.. ధర తెలిస్తే దడే
అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తారు. తమ శరీరానికి నప్పే రంగులను.. శరీరాకృతికి తగినట్లు దుస్తులు ధరించడం వలన అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే ఎంత కాస్ట్లీ దుస్తులు ధరించినా బంగారం ఆభరణాలు ధరించడం తప్పని సరి. చెవి పోగులు, ఉంగరాలు, చైన్స్, ఇలా రకరకాల బంగారు ఆభరణాలు ధరిస్తారు. ఐతే ఎప్పుడైనా అసలు బంగారంతో చేసిన దుస్తులు ఉంటాయని.. వాటిని ధరించి ఒక అమ్మాయి తిరుగుతుందని మీరు ఊహించారా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

బంగారు ఆభరణాలు ధరించడం సర్వసాధారణం. కానీ మీరు ఎప్పుడైనా బంగారు దుస్తులు ధరించిన వ్యక్తిని చూశారా? పురాతన కాలంలో రాజులు, రాణులు, రాణులు బంగారం, వెండి తొడుగులతో తమను తాము అలంకరించుకునేవారని చెబుతారు.. అయితే ఈ రోజుల్లో ఇలాంటి తొడుగులను ధరించడం సాధారణం కాదు. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. వీడియోలో, ఒక అమ్మాయి బంగారంతో చేసిన దుస్తులు ధరించి కనిపించింది. మొదటి చూపులోనే డ్రెస్ చాలా బాగుంది. అద్భుతంగా ఉంది అనిపిస్తుంది. వీక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ డ్రెస్ ధర తెలిశాక అందరూ షాక్ తిన్నారు. ప్రజలు రెండు గ్రూప్ లుగా విడిపోయి కామెంట్స్ తో తమ అభిప్రాయాని వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో పసిడి రంగులో మిలమిలా మెరిసే దుస్తులలో నడుస్తున్న అమ్మాయిని మీరు చూడవచ్చు. ఆమె దుస్తులు పూర్తిగా బంగారంతో తయారు చేయబడ్డాయి. దానిపై ఉన్నకళాత్మకమైన డిజైన్ ఆ డ్రెస్ ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఈ ప్రత్యేకమైన దుస్తులు ఎవరినైనా ఆకర్షించడం ఖాయం. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. కొందరు దీనిని ఫిల్మీ లుక్ అని పిలుస్తుండగా.. మరికొందరు దీనిని రాయల్ అని పిలుస్తున్నారు. ఈ దుస్తులలో ఉపయోగించిన బంగారం విలువపై కూడా ప్రజలు ఊహాగానాలు చేస్తున్నారు. కొంతమంది వినియోగదారులు దాని విలువ కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.
ఈ డ్రెస్ ఖరీదు ఎంత?
ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ అమ్మాయి ధరించిన దుస్తులను “అత్యంత విలువైన బంగారు దుస్తులు”గా అభివర్ణించింది. దీని ధర $1,088,000 . అంటే మన భారత దేశ కరెన్సీ లో రూ. 9.66 కోట్లకు పైగా (సుమారు $1.6 మిలియన్ USD) ఉంటుందని అంచనా. ఈ ప్రత్యేకమైన దుస్తులను అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ అనే సంస్థ తయారు చేసింది.
ఈ వీడియోను 700,000 లక్షల మందికి పైగా వీక్షించారు. 15,000 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఒక వినియోగదారుడు నగలు అంటే ఒకే.. కానీ బంగారు దుస్తులు కూడా అంటూ కామెంట్ చేస్తే మరొకరు ఈ దుస్తులను లాకర్‌లో ఉంచడం మంచిది.. చైన్ స్నాచింగ్ భయం ఉండదు అని అన్నారు. చాలా మంది వినియోగదారులు సరదాగా “ఇంత ఖరీదైన దుస్తులు ధరించి ఎవరైనా హాయిగా ఎలా నడవగలరు? దొంగలు అనుసరిస్తే ఎలా?” అంటూ తమ సందేహాన్ని వ్యక్తం చేశారు.
వీడియోను ఇక్కడ చూడండి
View this post on Instagram
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








