Madhya Pradesh: ఓరి బుడ్డోడా.. లక్ అంటే నీదే.. రూ.200లతో 53 లక్షలు కొట్టేశావ్
అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం. దసరా ఉత్సవాల్లో భాగంగా చాలాచోట్ల లక్కీ లాటరీలు నిర్వహిస్తారు. ఇందులో చిన్న మొత్తానికి కూపన్‌లు అమ్ముతుంటారు. చాలామంది అమ్మవారి సేవకోసం వినియోగిస్తారు కదా అని కూపన్‌లు కొంటూ ఉంటారు. ఇందులో భాగంగా కొందరు తమ పిల్లల పేరుమీద కూపన్లు కొంటుంటారు.
అలా ఓ మహిళ తన మనవడి పేరుమీద కొన్న కూపన్‌కి ఏకంగా అర కోటి విలువైన లగ్జరీ కారు తగిలింది. కారు బొమ్మలతో ఆడుకునే మనవడికి లాటరీలో అంత పెద్ద కారు తగలడంతో ఆ బాలుడి అమ్మమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్హాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జాక్‌పాట్ .. నాలుగేళ్ల బాలుడి రూపంలో ఆ కుటుంబాన్ని పలకరించింది. బర్హాన్‌పూర్‌లోని శిలాంపుర ప్రాంతానికి చెందిన కిరణ్ రాయిక్వార్ అనే మహిళ, సర్కార్ ధామ్ అనే సంస్థ ఆధ్వర్యంలో అభాపురిలో జరిగిన గర్బా ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ ఆమె తన నాలుగేళ్ల మనవడు మేధాన్ష్ పేరు మీద రూ.201 చెల్లించి.. నిర్వాహకులు అమ్ముతున్న ఒక ప్రైజ్ కూపన్ కొనుగోలు చేశారు. మరుసటి రోజు నిర్వాహకులు లక్కీ డ్రా నిర్వహించగా.. అందులో మేధాన్ష్ పేరుతో కొన్న కూపన్‌కు 53 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్ కారు దక్కింది. ఈ విషయం తెలిసి రాయిక్వార్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా కిరణ్ రాయిక్వార్ మాట్లాడుతూ తన మనవడికి కారు బొమ్మలంటే చాలా ఇష్టమని, ఎప్పుడు బొమ్మలు కొన్నా.. కారు బొమ్మలే కొనిపెట్టమని అడుగుతాడని చెప్పుకొచ్చింది. అయితే..లక్కీ డ్రా పుణ్యమా అని.. తన మనవడు నాలుగేళ్లకే ఏకంగా నిజమైన లగ్జరీ కారుకే యజమాని అయ్యాడండో సంతోషం వ్యక్తంచేసింది. కాగితాల ప్రక్రియ పూర్తయిన వెంటనే కారు తమ ఇంటికి వస్తుందని, కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ఈ సంఘటన తర్వాత చుట్టుపక్కల వారంతా మేధాన్ష్‌ను ‘లక్కీ బాయ్’ అని పిలుస్తున్నారని ఆమె ఆనందంగా చెప్పారు. మధ్యప్రదేశ్‌లో లాటరీలపై నిషేధం ఉన్నప్పటికీ, ఇలాంటి సాంస్కృతిక, వినోద కార్యక్రమాల్లో నిర్వహించే లక్కీ డ్రాలపై ఎలాంటి ఆంక్షలు లేకపోవడం గమనార్హం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
SSMB29: నాటు నాటు’ను మించేలా.. మహేశ్- ప్రియాంక చోప్రాపై ఫోక్ సాంగ్
డ్యామ్ గేట్లు తెరవటంతో.. ప్రాణాలు తీసిన పిక్నిక్..
పెళ్లి పీటలెక్కుతున్న త్రిష.. పెద్దలు చూసిన సంబంధానికి గ్రీన్ సిగ్నల్
విడాకులతో పార్టీ చేసుకున్న వ్యక్తి పాలతో స్నానం, కేక్ కటింగ్
భారీగా ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

