SSMB29: నాటు నాటు’ను మించేలా.. మహేశ్- ప్రియాంక చోప్రాపై ఫోక్ సాంగ్
దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB 29 నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ వచ్చేశాయి. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ విషయంలో కొత్త పేరు ప్రచారంలోకి వచ్చింది. అదే వారణాసి. మరి ఈ టైటిల్ ఇండియా మినహా ప్రపంచానికి అర్థమవుతుందా? వారణాసి ఫైనల్ అయిందా లేదా అనేది తెలియాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందే.
నవంబర్ 16న అవతార్ డైరెక్టర్ అధికారికంగా.. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో.. ఈ సినిమాలొ ఓ ఫోక్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. కీరవాణి సమకూర్చిన బాణీలతో సాంగ్ ట్రయల్ షూట్ పూర్తయింది. ఆ ఫోక్ సాంగ్‌కి మహేశ్, ప్రియాంకా చోప్రా చేసే ఊరమాస్ స్టెప్పులు అదిరిపోతాయని టాక్. మొత్తానికి నాటు నాటును మించేలా ఆ పాటను తీర్చిదిద్దాలన్నది జక్కన్న ప్లాన్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్‌ఎఫ్‌సీలో వారణాసిని తలపించేలా ఓ భారీ సెట్ వేసారు. సినిమాలో కీలక ఘట్టాలు వారణాసి నేపథ్యంలో సాగుతాయి. కానీ ఔట్ డోర్లో షూటింగ్ చేస్తే సెట్స్ వద్ద అభిమానుల తాకిడి ఎక్కువై వాళ్లను నియంత్రించడం కష్టంగా ఉంటుందని .. రూ. 50 కోట్ల ఖర్చుతో వారణాసి సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల షూటింగ్ సీన్స్.. లీక్ కాకుండా కూడా చూసుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇక.. రూ. 50 కోట్ల సెట్ రూపకల్పనలో.. రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ చూపారట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్యామ్ గేట్లు తెరవటంతో.. ప్రాణాలు తీసిన పిక్నిక్..
పెళ్లి పీటలెక్కుతున్న త్రిష.. పెద్దలు చూసిన సంబంధానికి గ్రీన్ సిగ్నల్
విడాకులతో పార్టీ చేసుకున్న వ్యక్తి పాలతో స్నానం, కేక్ కటింగ్
భారీగా ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్ల మీదే వాహనదారులు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

