Viral Letter: నాకు పెళ్ళాం కావాలి.. మంచి భార్యని చూడండి మహాప్రభో ప్రభుత్వాధికారి ఓ వ్యక్తి లెటర్.. కండిషన్స్ అప్లై
తన ఇంట్లో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని.. అందుకనే తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయినట్లు పేర్కొన్నాడు. కనుక దయ చేసి తన పెళ్లికి సహాయం చేసి.. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించండి మహాప్రభో అని వినతి చేశాడు.
ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎక్కువ మంది ప్రజలు తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయాన్ని సోషల్ మీడియా పేజీని స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నారు. ఇలా స్క్రోలింగ్ చేస్తున్న సమయంలో చాలా సార్లు ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. కొన్ని సార్లు ఆ విచిత్ర ఘటనలు కనులముందుకు వస్తాయి కూడా.. అప్పుడు అవి నమ్మడం కష్టం అవుతుంది కూడా. అంతేకాదు ఆ సంఘటలు కనిపిస్తుంటే.. కొన్ని సార్లు నవ్వుని తెప్పిస్తాయి. నవ్వును నియంత్రించుకోవడం కష్టం. ప్రస్తుతం ఒక ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
మీరు ఇప్పటి వరకూ ఇంటర్నెట్‌లో సెలవుల కోసం అనేక విచిత్రమైన అప్లికేషన్‌లను చూసి ఉంటారు. చాలా విచిత్రంగా లేఖలు రాసి విద్యార్థులు, ఉద్యోగులు సెలవులు అడుగుతుంటారు. అయితే ఇప్పుడు తెరపైకి వచ్చిన లేఖ వెరీ వెరీ స్పెషల్. ఈ ఉత్తరం నిజంగా విచిత్రం.. ఓ వ్యక్తి తనకు భార్య కావాలంటూ.. అది కూడా ఇలాంటి లక్షణాలున్న భార్యమాత్రమే కావాలంటూ ఒక వ్యక్తి లేఖ రాశాడు. ఆ లెటర్ ను రాజస్థాన్ సీఎం సహాయ శిబిరానికి పంపించాడు. నివేదిక ప్రకారం ఈ లేఖ దుబ్బి గంగద్వాడి నుంచి ముఖ్యమంత్రి సహాయ శిబిరానికి చేరుకుంది. ఒక వ్యక్తి తహసీల్దార్‌కు దరఖాస్తును అందజేసి తనకు ఎలాంటి భార్య కావాలో తెలిపాడు.
ఈ లేఖను మహావర్ అనే 40 ఏళ్ల వ్యక్తి రాసినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తరంలో తన ఇంటి పరిస్థితుల గురించి వెల్లడించాడు. తన ఇంట్లో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని.. అందుకనే తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయినట్లు పేర్కొన్నాడు. కనుక దయ చేసి తన పెళ్లికి సహాయం చేసి.. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించండి మహాప్రభో అని వినతి చేశాడు.
భార్యలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే:
1. సన్నగా ఉండాలి.
2. న్యాయంగా ఉండాలి.
3. వయస్సు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. అన్ని పనిలో నాయకత్వం లక్షణాలు ఉండాలి
बड़ी अजीब प्रार्थना आई है pic.twitter.com/LpOHPwlKgG
— राजस्थानी ट्वीट (@8PMnoCM) June 4, 2023
అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తహసీల్దార్ దరఖాస్తును గుర్తించిన అధికారి విచారణకు ఆదేశించాడు. @8PMnoCM అనే ఖాతా ద్వారా ఈ లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు. చాలా విచిత్రమైన ప్రార్థన వచ్చింది’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇప్పటి వరకూ 81 వేల మందికి పైగా ఈ లేఖను చూశారు.. భిన్నమైన స్పందనలు సొంతం చేసుకుంది ఈ పెళ్లి కోసం లేఖ
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..