Viral Video: తింగరోని తిక్క కుదిర్చిన లేగ దూడ.. మా మమ్మీనే కొడతావా అంటూ..

Man and Cow: చాలామంది పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అందులోనూ పాలిచ్చే మూగ జీవాలంటే మరీనూ. అయితే కొంతమంది మాత్రం వాటిని నిత్యం హింసిస్తూ ఉంటారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నా సోయి లేకుండా..

Viral Video: తింగరోని తిక్క కుదిర్చిన లేగ దూడ.. మా మమ్మీనే కొడతావా అంటూ..
Man And Cow
Follow us
Basha Shek

|

Updated on: Aug 09, 2022 | 10:44 AM

Man and Cow: సోషల్ మీడియాలో నిత్యం వందలాది వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవల జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో అప్‌లోడ్‌ చేసిన క్షణాల్లోనే వైరలవుతున్నాయి. నెటిజన్ల కూడా ఈ వీడియోలను చూడడానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలామంది పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అందులోనూ పాలిచ్చే మూగ జీవాలంటే మరీనూ. అయితే కొంతమంది మాత్రం వాటిని నిత్యం హింసిస్తూ ఉంటారు. వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నామన్నా సోయి లేకుండా వాటిని ఇబ్బంది పెడుతుంటారు. అయితే చనువిచ్చామని ఓవర్‌యాక్షన్‌ చేస్తే ఎవరూ ఊరికే ఉండరూ.. సాధు జంతువులైనా.. క్రూర జంతువులైనా తిరగబడతాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న వీడియో కూడా అలాంటిదే. ఇందులో ఆవును కొట్టబోయిన వ్యక్తికి లేగదూడ చుక్కలు చూపించింది.

నెట్టింట్లో బాగా వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక పశువుల దొడ్డిలో ఆవులను ఒక వ్యక్తి కొడుతూ కనిపిస్తాడు. ఆవులను బెదిరించేందుకు ఒక కర్రతో వాటిని కొడుతుంటాడు. ఇదే సమయంలో ఒక లేత ఆవు దూడ పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి అతని గుండెల మీద తంతుంది. దెబ్బకు సూట్‌ వేసుకున్న ఎంతో స్టైలిష్‌గా ఉన్న సదరు వ్యక్తి పేడలో పడిపోతాడు. ఏం చేయాలో తెలియక అంతా తుడుచుకుంటూ పైకి లేస్తూ పక్కకు వెళ్లిపోతాడు. ఫిజెన్‌ అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియో షేర్ చేయగా.. క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 37 లక్షల మందికి పైగా వ్యూస్‌ వచ్చాయంటే ఈ వీడియో ఎంత వైరలైందో అర్థం చేసుకోవచ్చు. అలాగే నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. భలే తిక్క కుదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..