Funny Video: ఆ నల్ల పిల్లి దాహం తీరనిది.. ఎన్ని నీళ్లయినా గుటకేస్తుంది.. ఫన్నీ వీడియో చూడాల్సిందే..!
Funny Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవ్వరు ఊహించలేరు. కానీ జంతువుల కంటెంట్‌కి మాత్రం ఆదరణ ఎప్పుడు ఉంటుంది. నెటిజన్లకి

Funny Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవ్వరు ఊహించలేరు. కానీ జంతువుల కంటెంట్‌కి మాత్రం ఆదరణ ఎప్పుడు ఉంటుంది. నెటిజన్లకి జంతువుల వీడియోలు బాగా నచ్చుతాయి. ముఖ్యంగా ఫన్నీ వీడియోలని ఎక్కువగా ఇష్టపడుతారు. తాజాగా ఓ నల్లపిల్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పిల్లి ఒక ప్రత్యేకమైన రీతిలో నీరు తాగడానికి ప్రయత్నిస్తుంది. సాధారణంగా ఇంట్లో పెంచుకునే జంతువులకి ఆహారం వేయడానికి ఒక ప్రత్యేకమైన పాత్రని పెడుతారు. అందులోనే వాటికి ఆహారం లేదా నీరు అందిస్తారు. కానీ జంతువులు ఒక్కోసారి నేరుగా కుళాయి నుంచి కూడా నీటిని తాగుతాయి. తాజాగా ఈ వీడియోలో ఒక నల్ల పిల్లి కిచెన్‌లోని కుళాయి వద్ద నీరు తాగడానికి ప్రయత్నించడం విశేషం.
పిల్లికి దాహం వేసినప్పుడు బహుశా దాని యజమాని నీళ్లు అందించలేదేమో.. అందుకే పిల్లి కిచెన్‌లోకి వెళ్లి ట్యాప్ తిప్పి నీరు తాగడం మొదలెట్టిందనుకుంటా.. అయితే తాగడానికి ప్రయత్నిస్తుంది. కానీ కుళాయి నుంచి వచ్చే నీరు మొత్తం దాని తలపై పడటం మనం గమనించవచ్చు. పిల్లి దాహం తీర్చుకోవడానికి నోరు, నాలుకను కుళాయి కింద పెట్టడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి చాలా నవ్వుకుంటున్నారు. అదే సమయంలో పిల్లి అమాయక చర్య నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.
View this post on Instagram