Viral Video: భార్య పిల్లని వదిలేసి కారులో వెళ్లిన భర్త.. ఐదుకోట్ల మందిని ఆకర్షించిన ఫన్నీ వీడియో

రకరకాల వీడియోలు నెట్టింట్లో కనిపిస్తుండడమే కాదు... వాటిని ప్రజలు ఇష్టపడుతున్నారు. ఒకరితో ఒకరు విస్తృతంగా పంచుకుంటారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా ఫన్నీ వీడియోలను పిల్లలు, పెద్దలు ఆసక్తిగా చూస్తారు. వాటిని చూసి పడీపడీ మరీ నవ్వేవారున్నారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. చాలా సార్లు కొన్ని విషయాలు తెలియకుండానే జరుగుతాయ.  అవి చాలా ఫన్నీగా కనిపిస్తాయి. వాటిని చూసిన తర్వాత ఎవరైనా సరే తమ నవ్వును నియంత్రించుకోలేరు.

Viral Video: భార్య పిల్లని వదిలేసి కారులో వెళ్లిన భర్త.. ఐదుకోట్ల మందిని ఆకర్షించిన ఫన్నీ వీడియో
Funny Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 02, 2024 | 1:24 PM

ఇంటర్నెట్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్నవారికి ప్రతిరోజూ అనేక వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. వీటిల్లో కొన్ని ఫన్నీగా ఉండి నవ్వు తెప్పిస్తే… మరికొన్ని అయ్యో పాపం అనిపించేలా జాలి కలిగిస్తాయి. మరికొన్ని ప్రకృతి వింతలను కనుల ముందుకు తీసుకొస్తాయి. ఇలా రకరకాల వీడియోలు నెట్టింట్లో కనిపిస్తుండడమే కాదు… వాటిని ప్రజలు ఇష్టపడుతున్నారు. ఒకరితో ఒకరు విస్తృతంగా పంచుకుంటారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా ఫన్నీ వీడియోలను పిల్లలు, పెద్దలు ఆసక్తిగా చూస్తారు. వాటిని చూసి పడీపడీ మరీ నవ్వేవారున్నారు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

చాలా సార్లు కొన్ని విషయాలు తెలియకుండానే జరుగుతాయ.  అవి చాలా ఫన్నీగా కనిపిస్తాయి. వాటిని చూసిన తర్వాత ఎవరైనా సరే తమ నవ్వును నియంత్రించుకోలేరు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కూడా అలాంటి సన్నివేశమే కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఒక మహిళ తన కుమార్తెని ఎత్తుకుని భర్తతో కలిసి ఎక్కడికో వెళ్లాలని భావించినట్లు ఉంది. తన భర్తతో పాటు కారు దగ్గరకు వచ్చింది. ఇద్దరూ రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు దగ్గరకు చేరుకున్నారు. అయితే ముందు భర్త కారులో ఎక్కి డ్రైవర్ సీటులో కూర్చున్నాడు. ఇంతలో కుమార్తెను ఎత్తుకున్న ఆ స్త్రీ ముందు ఒకవైపు కారు డోర్ ఓపెన్ చేసింది.. మళ్ళీ ఏమని అనుకుందో.. ఆ డోర్ ని మూసివేసి.. కారు వెనుక నుంచి వచ్చి మరో డోర్ తెరవాలని భావించింది.  మహిళ కారు అవతలివైపుకి వెళ్లి డోర్ తెరవడానికి ప్రయత్నిస్తుంది.. అయితే అప్పటికే ఆమె భర్త కారుని స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

ఈ ఫన్నీ వీడియో @TheFigen_ అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. దీనిని ఐదు కోట్ల మందికి పైగా చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు  ‘ఇక్కడ భర్త కారు తలుపులు మూసిన శబ్దం విన్నాడు… అందుకే అతను కారుని నడపడం  ప్రారంభించాడు అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..