AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షల్లో జీతం.. కోటిన్నర ఇల్లు! కట్‌చేస్తే ర్యాపిడో డ్రైవర్‌గా మారిన టెక్కీ.. అసలు ఏం జరిగిందంటే?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అంటేనే లక్షల్లో జీతాలతో లగ్జరీ లైఫ్‌స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఆ రంగుల ప్రపంచం ఒక్కసారిగా ఎలా కూలిపోతుందో చెప్పడానికి ఇక్కడ జరిగిన ఓ ఇన్సిడెంట్ నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు ఏడాదికి రూ. 40 లక్షల ప్యాకేజీ తీసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇప్పుడు తన ఇంటికి EMI కట్టేందుకు ఓ రాపిడో డ్రైవర్‌గా మారాడు. ఇతననికి సంబంధించిన స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదెంటో చూద్దాం పదండి.

లక్షల్లో జీతం.. కోటిన్నర ఇల్లు! కట్‌చేస్తే ర్యాపిడో డ్రైవర్‌గా మారిన టెక్కీ.. అసలు ఏం జరిగిందంటే?
Software Engineer Job Loss
Anand T
|

Updated on: Apr 13, 2026 | 7:00 AM

Share

ఒకప్పుడు లక్షల్లో జీతం తీసుకున్న ఓ ఉద్యోగి ప్రస్తుతం ఇంటి ఈఎమ్‌ఐ కట్టేందుకు ర్యాపిడో డ్రైవర్‌గా మారిన ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ టాప్‌ ఐటీ కంపెనీలో పనిచేసేవాడు. అతని ఏడాదికి రూ.40 లక్షలు జీతం వచ్చేది. అయితే తనకు 40 లక్షల జీతం వస్తుందిలే అన్న భరోసాతో అతను 2024లో ఘాజియాబాద్‌లోని ప్రతీక్ గ్రాండ్ సిటీలో రూ. 1.4 కోట్లు పెట్టి ఓ 3 BHK అపార్ట్‌మెంట్‌ కొన్నాడు. అయితే ఇందుకోసం అతన లోన్ తీసుకున్నాడు.దీంతో నెలకు రూ. 95,000 ఈఎంఐ చెల్లించాల్సి వచ్చేది.

అయితే ప్లాట్ కొన్న కొన్ని రోజులకే అతని ఊహించని పరిణామం ఎదురైంది. అనూహ్యంగా అతను పనిచేస్తున్న కంపెనీ భారీ లేఆప్స్‌ను ప్రకటించింది. దీంతో అతను ఉద్యోగం కోల్పోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక మరో ఉద్యోగం కోసం వెతకడం స్టార్ట్ చేశారు. మూడు నెలలుగా ప్రయత్నించినా మరో ఉద్యోగం అతనికి దొరకలేదు. ఓవైపు ఇంటి ఈఎమ్‌ఐ, మరోవైపు సేవింగ్స్ ఏవి లేకపోవడం, పెరిగిన ఖర్చులతో అతను పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు.

ఐటీ ఉద్యోగి నుండి ర్యాపిడో డ్రైవర్‌గా..

ఇక చేసేదేమి లేక తన ఇష్టపడి కొన్న ఇంటిని కాపాడుకునేందుకు ర్యాపిడో రైడర్‌గా పని చేయడం స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ కోడింగ్‌తో కుస్తీ పట్టిన చేతులు, ఇప్పుడు ఇంటి ఈఎంఐ కోసం బైక్ హ్యాండిల్ పట్టుకున్నాయంటూ. తన స్నేహితుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది.

నెటిజన్ల రియాక్షన్

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. ఇన్ని ఇబ్బందులు డేకన్నా ఇంటిని అమ్మేసి అప్పు తీర్చుకోవడం మంచిది అని సలహా ఇచ్చాడు. ఇంటిని నెలకు రూ. 65-70 వేలకు అద్దెకు ఇచ్చి, నువ్వు మరో చిన్న ఇంట్లో ఉంటూ కొత్త ఉద్యోగం కోసం వెతకాలని మరో యూజర్ కామెంట్ చేశాడు. కనీసం ఏడాదికి సరిపడా సేవింగ్స్ లేనప్పుడు ఇలాంటి భారీ పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని కొందరు కామెంట్ చేశారు.

టెకీలకు హెచ్చరిక

మొత్తానికి లక్షల్లో జీతాలు వస్తున్నాయి కదా.. అని లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడే టేకీలకు ఈ ఘటన ఒక హెచ్చరిక వంటిది. జీతం లక్షల్లో వస్తున్నా ఖర్చులపై నియంత్రణ లేకపోతే, కష్టకాలంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటన చక్కని నిదర్శనం. ఈ ఘటనతో ఆస్తుల కంటే ఆర్థిక భద్రతే ముఖ్యం అనే సందేశం ఇప్పుడు ఐటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us