AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తినేముందు తప్పక తెలుసుకోండి..

షుగర్ ఉన్నవారు పండ్లు తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు. అయితే మనకు సులభంగా లభించే బొప్పాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా పచ్చి బొప్పాయి, పండిన బొప్పాయిలలో ఏది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందనే అంశంపై నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Krishna S
|

Updated on: Apr 13, 2026 | 6:54 AM

Share
కోట్లాది మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య షుగర్. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. ఈ క్రమంలో బొప్పాయి పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక గొప్ప వరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోమ్ జె డయాబెటిస్ న్యూట్రిషన్ మెటాబ్ డిస్ అనే జర్నల్‌లో ప్రచురితమైన తాజా పరిశోధనల ప్రకారం.. బొప్పాయిలోని విటమిన్ సి, ఫైబర్, ఫ్లేవనాయిడ్లు, సాపోనిన్లు రక్తంలో గ్లూకోజ్‌ను సమర్థవంతంగా తగ్గించగలవని వెల్లడైంది.

1 / 5
సాధారణంగా బొప్పాయిని పండుగా తింటాం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు పండిన దానికంటే పచ్చి బొప్పాయే ఎక్కువ ప్రయోజనకరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. పచ్చి బొప్పాయిలో సహజ చక్కెరల శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. దీనివల్ల పచ్చి బొప్పాయిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా స్థిరంగా ఉంటాయి.

2 / 5
ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ లేదా టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. పీచుపదార్థం విషయంలో కూడా పచ్చి బొప్పాయి పైచేయి సాధిస్తుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఇన్సులిన్ సెన్సిటివిటీకి మద్దతు ఇవ్వడమే కాకుండా శరీరంలో గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది.

3 / 5
మరోవైపు బాగా పండిన బొప్పాయి మెత్తగా, తీపిగా ఉండటం వల్ల అందులో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే అవకాశం ఉన్నందున, మధుమేహ బాధితులు పండిన పండును తినేటప్పుడు పరిమాణంపై నియంత్రణ కలిగి ఉండటం చాలా అవసరం.

4 / 5
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి అభిప్రాయం ప్రకారం.. మనకు తెలియకుండానే చేసే చిన్న చిన్న ఆహారపు అలవాట్లు ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతాయి. అందుకే పచ్చి బొప్పాయిని కూరలు లేదా సలాడ్ల రూపంలో రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అయితే ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది కాబట్టి, మీ మందులకు అనుగుణంగా సరైన మోతాదును తెలుసుకోవడానికి పోషకాహార నిపుణుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!