Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Frog’s Swimming: ఓరి దీని వేషాలో..! వెనకీతలో మనిషిని మించిపోయిన కప్ప.. వీడియో చూసినా నమ్మలేరేమో..

Frog's Swimming: మనకు పూర్తిగా తెలియని ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు చాలా అరుదుగా మన కంట పడతాయి. అలాంటి అద్భుతమే ఓ వ్యక్తి కంట పడింది. అంతే.. ఆ వ్యక్తి దానికి..

Frog's Swimming: ఓరి దీని వేషాలో..! వెనకీతలో మనిషిని మించిపోయిన కప్ప.. వీడియో చూసినా నమ్మలేరేమో..
Frog Swimming
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 24, 2023 | 2:55 PM

Frog’s Swimming: మనకు పూర్తిగా తెలియని ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు చాలా అరుదుగా మన కంట పడతాయి. అలాంటి అద్భుతమే ఓ వ్యక్తి కంట పడింది. అంతే.. ఆ వ్యక్తి దానికి సంబంధించిన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. కొందరు నీటిలో వెనక్కు తిరిగి ఈత కొట్టగలరు, అలా ఇప్పటివరకు మనకు తెలిసినంతలో మనిషి, కోతులు మాత్రమే చేయగలవు. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కప్ప అలా వెనక్కు తిరిగి ఈత కొడుతుంది. అది కూడా అచ్చం మనిషిలా కాళ్లను స్పీడ్‌గా మూమెంటమ్‌ కోసం ఉపయోగిస్తూ నీటిలో జలకాలడుతుంది.

waowafrica అనే ఇన్‌స్టా ఖాతా నుంచి జూన్ 23న షేర్ అయిన ఈ వీడియోలో మీరు అందుకు సంబంధించిన దృశ్యాలను చూడవచ్చు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వీడియోపై తమ స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. అది మిగతా కప్పల కంటే కొంచెం భిన్నమైనదని, ఉన్న జీవితాన్ని ఇష్టానుసారం ఎంజాయ్ చేస్తుందని, నిజంగా ఇది ప్రకృతి అద్భుతమని, దీన్ని పాకిస్థాన్‌కి పంపితే వాళ్లకు గోల్డ్ మెడల్ తీసుకువస్తుందని, ఇది నిజమా కాదో నమ్మలేకపోతున్నామని.. రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షా 58 వేల వీక్షణలు, 8 వేల వరకు లైకులు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో..

View this post on Instagram

A post shared by Waow Africa (@waowafrica)

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..