Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Public Romance: బైక్ మీదే ప్రేమ జంట బరితెగింపు.. మండిపడుతున్న నెటిజన్లు.. రంగంలోకి దిగిన పోలీసులు..

Uttara Pradesh: కొంత మంది పబ్లిక్ రొమాన్స్ అనేది గొప్ప కార్యం అన్నట్లుగా ఫీలైపోతున్నారు. ఈ నేపథ్యంలో బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేస్తున్నవారి వీడియోలు తరచూగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు కూడా వైరల్..

Public Romance: బైక్ మీదే ప్రేమ జంట బరితెగింపు.. మండిపడుతున్న నెటిజన్లు.. రంగంలోకి దిగిన పోలీసులు..
Romance On Bike Visuals
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 21, 2023 | 9:46 PM

Uttara Pradesh: కొంత మంది పబ్లిక్ రొమాన్స్ అనేది గొప్ప కార్యం అన్నట్లుగా ఫీలైపోతున్నారు. ఈ నేపథ్యంలో బైక్‌పై వెళ్తూ రొమాన్స్ చేస్తున్నవారి వీడియోలు తరచూగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువకుడు బైక్ నడుపుతుండగా.. అతనితో ఉన్న యువతి బైక్ పెట్రోల్ ట్యాంకర్ మీద కూర్చుని సదరు యువకుడిని కౌగిలించుకుని రొమాన్స్ చేస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఇందిరాపురం ప్రాంతంలో జరిగిన ఈ ఘనటకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సదరు ప్రేమ జంట ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కడమే కాక వ్యక్తిగత బాధ్యత కూడా లేకుండా రాత్రి వేళలో బైక్ మీద ఇలా చేశారు. @Akashkchoudhary అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ అయిన వీడియోపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా స్పందించారు. ‘సమాచారం తెలిపినందుకు ధన్యవాదాలు, తగిన చర్యలు తీసుకుంటాము’ అనే అర్థం వచ్చేలా పోలీసు శాఖ వీడియోపై రిట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో.. 

కాగా, వీడియోను చూసిన నెటిజన్లు బైక్‌పై రొమాన్స్ చేస్తూ వెళ్లిన ప్రేమజంటపై మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్ల ట్రాఫిక్ నియమాలు పాటించేవారికి కూడా ప్రమాదాలు జరుగుతాయని, వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, వాళ్ళ బైక్‌ని ‘బుల్డోజర్’ కింద వేయాలని, పోలీసులు యాక్షన్ తీసుకోకుంటే ఇలాంటోళ్లకు మార్పు రాదని కామెంట్ చేస్తున్నారు. బుధవారం ఉదయమే షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 5 వేల వీక్షణలు వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..