- Telugu News Photo Gallery Cricket photos ICC Test Rankings: Ravichandran Ashwin regains Top Spot, check here for full list of Test Bowlers Rankings
ICC Test Rankings: మళ్లీ మనోడిదే అగ్రస్థానం.. టెస్ట్ ‘టాప్ 10 లిస్టు’లో ముగ్గురు భారతీయులు.. వారెవరంటే..?
ICC Test Rankings: ఐసీసీ తాజాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెటర్ల ర్యాకింగ్స్ ప్రకటించింది. బ్యాటర్ల ర్యాకింగ్స్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. నెం.1 ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా.. అలాగే నెం.1 టెస్ట్ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ తమ స్థానాలను కాపాడుకున్నారు.
Updated on: Jun 23, 2023 | 6:40 AM

ICC Test Rankings: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ బౌలర్ల ర్యాంగింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్ 860 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ 29 పాయింట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో టీమిండియా నుంచి మరో ఇద్దరు బౌలర్లు కూడా ఉన్నారు. అసలు టాప్ 10 బౌలర్ల లిస్టులో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

1. రవిచంద్రన్ అశ్విన్(భారత్)- 860 పాయింట్లు

2. జేమ్స్ అండర్సన్(ఇంగ్లండ్)- 829 పాయింట్లు

3. కగిసో రబడ (దక్షిణాఫ్రికా)- 825 పాయింట్లు

4. పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)- 824 పాయింట్లు

5. ఒలీ రాబిన్సన్(ఇంగ్లండ్)- 802 పాయింట్లు

6. నాథన్ లియాన్(ఆస్ట్రేలియా)- 799 పాయింట్లు

7. షాహీన్ ఆఫ్రిద (పాకిస్థాన్)- 787 పాయింట్లు

8. జస్ప్రీత్ బుమ్రా(భారత్)- 772 పాయింట్లు

9. రవీంద్ర జడేజా(భారత్)- 765 పాయింట్లు

10. స్టువర్ట్ బ్రాడ్(ఇంగ్లండ్)- 765 పాయింట్లు




