- Telugu News Photo Gallery Cricket photos BCCI invites applications for vacant Men’s Selection Committee post; check her for job eligibility details
BCCI Selection Committee: టీమిండియా సెలెక్టర్ కోసం అప్లికేషన్స్ ప్రారంభం.. కావాల్సిన అర్హతలేమిటంటే..?
Indian Team’s New Chief Selector: చేతన్ శర్మ రాజీనామా నేపథ్యలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఒక పదవి ఖాళీగా ఉంది. ఆ స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచనలో బీసీసీఐ అప్లికేషన్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ క్రమంలో సీనియర్ సెలెక్షన్ కమిటీలో సభ్యుడు కావాలంటే ఉండవలసిన అర్హతలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 23, 2023 | 8:37 AM

బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న చీఫ్ సెలెక్టర్ స్థానానికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో అనే విషయంలో బీసీసీఐ కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఈ మేరకు దరఖాస్తు చేయాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉండాలి.

7 టెస్ట్ మ్యాచ్‌లు కాకపోతే, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు లేదా 10 వన్డే మ్యాచ్‌లు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి.

ఇదే కాక, దరఖాస్తు చేసుకునేవారు మాజీ ఆటగాడు ఆటగాడై.. రిటైర్మెంట్ తర్వాత కనీసం ఐదేళ్ల కాలం పూర్తి చేసి ఉండాలి. ఇంకా గత ఐదేళ్లలో మరే ఇతర క్రికెట్ కమిటీలో సభ్యుడుగా లేని వ్యక్తి ఈ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇటీవలి కాలంలో ఓ న్యూస్ చానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రిజైన్ చేశారు. ఈ క్రమంలో తాత్వాలిక చీఫ్ సెలెక్టర్‌గా వివ సుందర్ దాస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కాగా, చీఫ్ సెలెక్టర్ పదవిలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నియమితుడయ్యే అవకాశం ఉందని పలు కథనాలు వెలువడుతున్నాయి.





























